Motorola : స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మోటరోలా నుంచి 200 ఎంపీ కెమెరాతో ఫోన్
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్ | ఇదివరకు ఫోటో తీయాలంటే ఖచ్చితంగా కెమెరా ఉండాల్సిందే. కేవలం ఫోటోల కోసమే ప్రత్యేకంగా కెమెరాలను కొనుక్కునేవాళ్లం. కానీ ఇప్పుడు కెమెరాలు కొనే అవసరమే లేదు.

ఇదివరకు ఫోటో తీయాలంటే ఖచ్చితంగా కెమెరా ఉండాల్సిందే. కేవలం ఫోటోల కోసమే ప్రత్యేకంగా కెమెరాలను కొనుక్కునేవాళ్లం. కానీ ఇప్పుడు కెమెరాలు కొనే అవసరమే లేదు. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచమే మన చేతుల్లో ఉంటుంది. 64 మెగాపిక్సెల్, 108 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన ఫోన్లు కూడా మార్కెట్లోకి వచ్చేశాయి. ఇప్పుడు అంతకుమించి.. అంటే 200 మెగాపిక్సెల్ కెమెరాతో తొలి ఫోన్ రాబోతోంది.
మోటరోలా.. తొలిసారి 200 ఎంపీ కెమెరా కలిగిన ఫోన్‌ను త్వరలో తీసుకురాబోతోంది. వచ్చే సంవత్సరం ఆ ఫోన్ మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఇప్పటి వరకు 200 ఎంపీ కెమెరాతో ఏ స్మార్ట్‌ఫోన్ రాలేదు. మోటరోలా తర్వాత.. జియోమీ, సామ్సంగ్.. 2023లో 200 ఎంపీ కెమెరాతో స్మార్ట్ఫోన్లను తీసుకురానున్నాయి.

అయితే.. సామ్సంగ్ లెన్స్‌తోనే మోటరోలా… 200 ఎంపీ కెమెరాను డెవలప్ చేయనుంది. 200 ఎంపీ స్మార్ట్‌ఫోన్ కెమెరా సెన్సార్‌ను ఇప్పటికే మోటరోలా లాంచ్ చేసింది. 200 ఎంపీ కెమెరాతో 30 ఎఫ్‌పీఎస్‌తో 8కే వీడియోలను రికార్డు చేసుకోవచ్చు. 120 ఎఫ్‌పీఎస్‌తో 4కే వీడియోలను కూడా రికార్డు చేసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Whatsapp | రెండు కీలకమైన సెక్యూరిటీ ఫీచర్స్ తీసుకొచ్చిన వాట్సాప్
Motorola : భారత్‌లో త్వరలో మోటో ట్యాబ్ జీ70 లాంఛ్
WhatsApp : వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు దీటుగా
Password | మీ పాస్వర్డ్ హ్యాకర్లకు తెలిసిపోయిందని అనుమానమా? ఇలా చెక్ చేసుకోండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

