WhatsApp : వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు దీటుగా
వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్ | సాధారణంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కువ మంది ఉపయోగించేది ఎమోజీలు. వాట్సప్‌లో కూడా చాలామంది ఎమోజీల ద్వారానే
సాధారణంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కువ మంది ఉపయోగించేది ఎమోజీలు. వాట్సప్‌లో కూడా చాలామంది ఎమోజీల ద్వారానే ఇతరులతో చాట్ చేస్తుంటారు. అయితే.. ఎమోజీలకు ప్రత్యామ్నాయంగా వచ్చినవే స్టిక్కర్ ప్యాక్స్. ఈ మధ్య అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో స్టిక్కర్ ప్యాక్స్ ఫేమస్ అవుతున్నాయి.

తాజాగా వాట్సప్ కూడా స్టిక్కర్ ప్యాక్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు వాట్సప్ స్టిక్కర్స్ చాలానే అందుబాటులోకి వచ్చినా.. అవి థర్డ్ పార్టీ యాప్స్ నుంచి తీసుకున్నవే కానీ.. తాజాగా సొంతంగా వాట్సప్ యూజర్లే స్టిక్కర్లను క్రియేట్ చేసుకునే ఫీచర్‌నే వాట్సప్ తీసుకొచ్చింది.
వాట్సప్ బీటా వర్షన్లో ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అంటే టెస్టింగ్ ఫేజ్‌లో ఉందన్నమాట. ఒకసారి టెస్టింగ్ పూర్తయితే.. అందరు యూజర్లకు సొంతంగా స్టిక్కర్లను క్రియేట్ చేసుకునే ఆప్షన్‌ను వాట్సప్ కల్పించనుంది. వాట్సప్ వెబ్‌లో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందట.
స్నిప్పింగ్, క్రాపింగ్, రొటేటింగ్ లాంటి ఆప్షన్లతో వాట్సప్ స్టిక్కర్లను క్రియేట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఏవైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు, పండుగ సమయాల్లో యూజర్లే సొంతంగా స్టిక్కర్స్‌ను క్రియేట్ చేసుకొని తమ కాంటాక్ట్ లిస్టులోని ఫ్రెండ్స్‌కు పంపించుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Xiaomi : డిసెంబర్ 16న షియామి 12, షియామి 12X లాంఛ్
Password | మీ పాస్వర్డ్ హ్యాకర్లకు తెలిసిపోయిందని అనుమానమా? ఇలా చెక్ చేసుకోండి..
Xiaomi : డిసెంబర్ 16న షియామి 12, షియామి 12X లాంఛ్
Whatsapp | రెండు కీలకమైన సెక్యూరిటీ ఫీచర్స్ తీసుకొచ్చిన వాట్సాప్
Amazon Prime : డిసెంబర్ 13 లోపే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి.. లేదంటే?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

