Amazon Prime : డిసెంబర్ 13 లోపే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి.. లేదంటే?
డిసెంబర్ 13 లోపే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి | అమెజాన్ ప్రైమ్ మెంబర్షిఫ్ గురించి తెలుసు కదా. ఈ మెంబర్షిప్ తీసుకుంటే.. అమెజాన్‌లో కొనుగోలు చేసిన ప్రాడక్ట్స్ త్వరగా డెలివరీ అవుతాయి
అమెజాన్ ప్రైమ్ మెంబర్షిఫ్ గురించి తెలుసు కదా. ఈ మెంబర్షిప్ తీసుకుంటే.. అమెజాన్‌లో కొనుగోలు చేసిన ప్రాడక్ట్స్ త్వరగా డెలివరీ అవుతాయి. దానితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్ లాంటి ఇతర ఫీచర్లను కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ సంవత్సరానికి రూ.999గా ఉంది. అయితే.. ఈ ధర డిసెంబర్ 13 వరకే ఉండనుంది. డిసెంబర్ 13 తర్వాత అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ధరను పెంచుతున్నట్టు అమెజాన్ ప్రకటించింది. డిసెంబర్ 13 తర్వాత అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలంటే.. రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది. అంటే 500 రూపాయలు ఎక్కువ అన్నమాట.

అమెజాన్ ప్రైమ్ తీసుకోవాలని అనే ఆలోచన ఉంటే మాత్రం వచ్చే నెల డిసెంబర్ 13లోపే తీసేసుకోండి. లేదంటే 500 రూపాయలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
అంటే సుమారుగా 50 శాతం ప్రైమ్ మెంబర్షిప్ ధరను పెంచేసింది అమెజాన్. డిసెంబర్ 13 తర్వాత సంవత్సరం ప్లాన్ తీసుకుంటే రూ.1499, మూడు నెలల ప్లాన్ తీసుకుంటే రూ.459(ప్రస్తుతం రూ.329), ఒక నెల ప్లాన్ తీసుకుంటే రూ.179(ప్రస్తుతం రూ.129)గా ధరలు ఉండనున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Tiktok : టిక్‌టాక్‌పై బ్యాన్ ఎత్తివేత.. గత 15 నెలల్లో ఇది నాలుగో సారి
OnePlus 9RT : పేరు మార్చుకొని భారత్‌లో లాంచ్ అవనున్న వన్‌ప్లస్ 9ఆర్టీ.. ఫీచర్లు ఇవే
Moto G200 : అద్భుతమైన ఫీచర్లతో రానున్న మోటో జీ200.. ధర ఎంతో తెలుసా?
Shortcuts : వాట్సాప్ వెబ్ లో షార్ట్‌కట్స్ గురించి తెలుసా..? అవేంటంటే..?
Motorola : భారత్ మార్కెట్లో త్వరలో మోటో జీ71, మోటో జీ51, మోటో జీ31 ఎంట్రీ
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

