ఈరోజుల్లో కంప్యూటర్లో ఖచ్చితంగా ఉండాల్సిన సాఫ్ట్వేర్ ఏదంటే టక్కున వచ్చే సమాధానం.. ఎంఎస్ వర్డ్. అది లేకుంటే ఏ పనీ చేయలేం. ఏదైనా డాక్యుమెంట్ టైప్ చేయాలంటే వర్డ్ కావాల్సిందే. ఏదైనా డేటాను చెక్ చేసుకోవాలంటే, స్ప్రెడ్‌షీట్‌ను క్రియేట్ చేసుకోవాలంటే ఎక్సెల్ ఉండాల్సిందే. ప్రజెంటేషన్ కోసం స్లైడ్స్ డిజైన్ చేయాలంటే పవర్‌పాయింట్ ఉండాల్సిందే. అందుకే ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే ఇవన్నీ అందులో పొందొచ్చు.
నిజానికి ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ ఉచితంగా లభించదు. దాన్ని అఫిషియల్‌గా కొనుక్కోవాలి. కానీ.. కొందరు దాన్ని పైరసీ చేసి.. అమ్ముతుంటారు. అటువంటి సాఫ్ట్వేర్ ఎప్పుడూ ఉపయోగించకూడదు. కానీ.. ఆఫీస్ సాఫ్ట్వేర్ కొనాలంటే వేలల్లో ఉంటుంది కాస్ట్. మరి.. ఏం చేయాలి.. అని ఆలోచిస్తున్నారా? దాని కోసం మీరు ఒక చిన్న పని చేస్తే చాలు.. మీకు ఉచితంగా మైక్రోసాఫ్ట్ సంస్థే.. జెన్యూన్ ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌ను అందిస్తుంది.
దానికోసం స్టూడెంట్ లేదా టీచర్ లేదా ఫ్యాకల్టీ మెంబర్‌గా మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లో రిజిస్టర్ అయితే చాలు. కాకపోతే దానికి ఇన్స్టిట్యూట్కు సంబంధించిన వెరిఫైడ్ ఈమెయిల్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లో స్టూడెంట్ ఈమెయిల్ అడ్రస్‌తో లాగిన్ అయి రిజిస్టర్ చేసుకున్నవాళ్లకు ఎంఎస్ ఆఫీస్ స్టూడెంట్ ప్యాకేజ్‌ను మైక్రోసాఫ్ట్ ఉచితంగా అందిస్తుంది. ఆఫీస్ 365 ద్వారా లాగిన్ అయి.. ఎంఎస్ ఆఫీస్ సూట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ సూట్లో వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్‌తో పాటు అవుట్‌లుక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, వన్‌డ్రైవ్, షేర్‌పాయింట్ సాఫ్ట్‌వేర్‌ను కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Whatsapp | రెండు కీలకమైన సెక్యూరిటీ ఫీచర్స్ తీసుకొచ్చిన వాట్సాప్
Motorola : భారత్‌లో త్వరలో మోటో ట్యాబ్ జీ70 లాంఛ్
WhatsApp : వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు దీటుగా
Password | మీ పాస్వర్డ్ హ్యాకర్లకు తెలిసిపోయిందని అనుమానమా? ఇలా చెక్ చేసుకోండి..
Xiaomi : డిసెంబర్ 16న షియామి 12, షియామి 12X లాంఛ్