న్యూఢిల్లీ : ఎంట్రీ లెవెల్ యూజర్ల కోసం మోటో ఈ13ను కస్టమర్ల ముందుకు తెచ్చిన కొద్ది వారాల తర్వాత కంపెనీ లేటెస్ట్గా మోటో జీ73 5జీని ( Moto G73 5G) భారత్‌లో లాంఛ్ చేసింది. మెరుగైన ఫీచర్లు, హార్డ్‌వేర్‌తో బడ్జెట్ కస్టమర్లు లక్ష్యంగా మోటో జీ73 5జీని మోటో లాంఛ్ చేసింది. ఈ ధరలో పలు స్మార్ట్ఫోన్లు 6జీబీ ర్యాంతో అందుబాటులో ఉండగా మోటో జీ73 5జీ 8జీబీ ర్యాంతో కస్టమర్ల ముందుకొచ్చింది.
స్మూత్ స్క్రోలింగ్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు డిస్ప్లే 120హెచ్జడ్ రిఫ్రెష్ రేట్‌ను ఆఫర్ చేస్తోంది. మోటో జీ73 5జీ 8జీబీ ర్యాం, 128జీబీ స్టోరేజ్ వేరింయట్ రూ. 18,999కి అందుబాటులో ఉండగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై కస్టమర్లు మరో రూ. 2000 వరకూ అదనపు డిస్కౌంట్ పొందుతారని మొటొరోలా ప్రకటించింది. మోటో జీ73 5జీ మిడ్నైట్ బ్లూ, లుసెంట్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 16 నుంచి ఫ్లిప్‌కార్ట్, అఫిషియల్ మొటొరొలా ఛానెళ్లపై అందుబాటులో ఉంటుంది.
మోటో జీ73 5జీ ఫుల్హెచ్డీ+ రిజల్యూషన్‌తో 6.5 ఇంచ్ డిస్ప్లేను కలిగిఉంది. ఫోన్ వెనుకభాగంలో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సర్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ ఆకట్టుకుంటాయి. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా అల్ట్రా పిక్సెల్ టెక్నాలజీతో కూడిఉందని కంపెనీ పేర్కొంది. ప్రైమరీ కెమెరా ఫుల్ హెచ్డీ వీడియోలను కూడా రికార్డు చేస్తుంది. ఇక ముందుభాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉండగా 30డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది.
Read More :