Realme Fold SmartPhone | ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ బాటలో రియల్మీ.. ఆ మూడు ఫోన్లతో సై అంటే సై!
Realme Fold SmartPhone | త్వరలో రియల్మీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానున్నది. శామ్సంగ్, షియోమీ, మోటరోలా రేజర్ వంటి బ్రాండ్లతో రియల్ మీ ఫోల్డబుల్ ఫోన్ పోటీ పడనున్నది.
Realme Fold SmartPhone | శామ్సంగ్, వివో, ఒప్పో, టెక్నో, షియోమీ దారిలో చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మీ ప్రయాణించనున్నది. త్వరలో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనున్నది. ఈ సంగతి రియల్మీ వైస్‌ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ ఇటీవల వెల్లడించారు. రియల్మీ విడుదల చేసే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌పై కస్టమర్ల ప్రాధాన్యాలను అడిగి తెలుసుకున్నారు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా రియల్మీ ఫ్లిప్, రియల్మీ ఫోల్డ్ రూపాల్లో తీసుకు రానున్నట్లు సంకేతాలిచ్చారు. రియల్ మీ అనుబంధ సంస్థ వన్‌ప్లస్ సైతం ఇటీవల తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ టీజర్ విడుదల చేసింది. ఫోల్డబుల్ డిస్ప్లే టెక్నాలజీలో ఇంప్రూవ్మెంట్స్తోపాటు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లకు కస్టమర్ల నుంచి గిరాకీ పెరిగింది. ఇతర స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు ఆవిష్కరించడంతో రియల్మీ కూడా ఆ బాటలో పయనించనున్నది. రియల్ మీ తీసుకొచ్చే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్.. శామ్సంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్4, గెలాక్సీ జడ్ ఫోల్డ్ 4, షియోమీ మిక్స్ ఫోల్డ్2, మోటరోలా రేజర్ ఫోన్లతో పోటీ పడనున్నదని భావిస్తున్నారు.
ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శామ్‌సంగ్‌దే ప్రస్తుతం ఆధిపత్యం. ఇప్పటికే శామ్సంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్4, గెలాక్సీ జడ్ ఫ్లిప్4 ఫోన్లను ఆవిష్కరించింది. చైనా స్మార్ట్ ఫోన్ జెయింట్ హువావే సైతం తన మ్యాట్ ఎక్స్, మ్యాట్ ఎక్స్2, షియోమీ మిక్స్ ఫోల్డ్ 2, మోటోరాజ్ర్ తన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను గతేడాది మార్కెట్లోకి తెచ్చాయి.
బీబీకే ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ వివో ఫోల్డబుల్ ఫోన్ `వివో ఎక్స్ ఫోల్డ్ ఫోన్` చైనా మార్కెట్లో పట్టు సంపాదించింది. అంతే కాదు దీని కొనసాగింపుగా వివో ఎక్స్ ఫోల్డ్2 కూడా సిద్ధం అవుతున్నది. మరో స్మార్ట్ ఫోన్ సంస్థ టెక్నో తన తొలి ఫోల్డబుల్ ఫోన్.. ఫాంటం వీ ఫోల్డ్ ఫోన్‌ను ఇటీవల బార్సిలోనాలో ముగిసిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2023లో ఆవిష్కరించింది. గతేడాది డిసెంబర్లో ఒప్పో తన ఫైండ్ ఎన్2, ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

