Microsoft Windows 11 : సరికొత్త ఓఎస్.. మైక్రోసాఫ్ట్ విండోస్ 11.. మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఇవే
మైక్రోసాఫ్ట్ విండోస్ 11.. మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ | విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత.. మైక్రోసాఫ్ట్.. చాలా ఏళ్ల పాటు.. వేరే ఓఎస్‌ను తీసుకురాలేదు.
ప్రస్తుతం యాపిల్ డివైజ్‌లు తప్పించి.. మిగితా పీసీలు, లాప్‌టాప్‌లు వేటిలో చూసినా ఉండేది మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమే. చాలామంది ప్రస్తుతం విండోస్ 10ని వాడుతున్నారు. అతి తక్కువ మంది మాత్రమే విండోస్ 7ను వాడుతున్నారు. అయితే.. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత.. మైక్రోసాఫ్ట్.. చాలా ఏళ్ల పాటు.. వేరే ఓఎస్‌ను తీసుకురాలేదు. తాజాగా.. విండోస్ 11ను ప్రకటించింది. ప్రస్తుతం విండోస్ 11 బీటా వర్షన్‌ను టెస్ట్ చేస్తోంది మైక్రోసాఫ్ట్.

త్వరలోనే విండోస్ 10 ఓఎస్ వాడే ప్రతి యూజర్.. విండోస్ 11 కి ఓఎస్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. కానీ.. విండోస్ 11 ఓఎస్.. సిస్టమ్‌లో వర్క్ కావాలంటే మాత్రం.. మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి. అవి ఉంటేనే ఓఎస్ వర్క్ అవుతుంది.

విండోస్ 11 ఓఎస్ కోసం.. ఖచ్చితంగా కంపాటిబుల్ 64 బిట్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, యూఈఎఫ్ఐ సెక్యూర్ బూట్, గ్రాఫిక్ రిక్వైర్మెంట్స్, టీపీఎం 2.0 లాంటి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఖచ్చితంగా ఉండాలి.

అయితే.. 2017 కంటే ముందు తీసుకున్న ప్రాసెసర్లు.. విండోస్ 11 ఓఎస్‌లో సపోర్ట్ చేయవని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. అంటే.. 2017 కంటే ముందు కొనుగోలు చేసిన ప్రాసెసర్లను అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఇంటెల్ కోర్ ఎక్స్ సిరీస్, జియోన్ డబ్ల్యూ సిరీస్, ఇంటెల్ కోర్ 7820 హెచ్‌క్యూ సీపీయూ ప్రాసెసర్లు.. విండోస్ 11లో వర్క్ చేస్తాయి.
అలాగే.. ఏఎండీ ప్రాసెసర్లలోనూ విండోస్ 11 వర్క్ అవుతుందని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. అయితే.. బూట్ క్యంప్ ద్వారా మాక్బుక్లలో విండోస్ 11 సపోర్ట్ విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. టీపీఎం 2.0 రిక్వైర్మెంట్ వల్ల.. మాక్‌బుక్ యూజర్లు.. విండోస్ 11ను ఇన్స్టాల్ చేసుకోలేరు. ఎందుకంటే.. యాపిల్.. తన మాక్ సిస్టమ్స్‌లో టీపీఎం 2.0 సపోర్ట్‌ను అందించడం లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : How to Lock Facebook Profile : ఫేస్బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేయడం ఎలా?
JioPhone Next: వచ్చే వారమే ఇండియాలో జియోఫోన్ నెక్ట్స్ ప్రి బుకింగ్స్!
Youtube : షాకింగ్.. 10 లక్షల వీడియోలను తొలగించిన యూట్యూబ్.. కారణం ఇదే
Koo : కోటి మంది యూజర్ల మార్క్‌కు చేరుకున్న దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘కూ’
Drone Rules 2021 : డ్రోన్లపై ఉన్న ఆంక్షలను తొలగించిన కేంద్రం.. ఇక నుంచి ఈజీ అప్రూవల్ సిస్టమ్
Yahoo News : ఇండియాలో యాహూ షట్‌డౌన్.. ఇక నుంచి యాహూ న్యూస్ కనిపించవు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

