ఫేస్బుక్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్ రాబోతుంది. రీసెంట్గా ఫేస్బుక్ కంపెనీ పేరును మెటాగా ఆ కంపెనీ సీఈవో మార్చిన విషయం తెలిసిందే. మెటా కంపెనీ నుంచే ఈ స్మార్ట్‌వాచ్ లాంచ్ కాబోతోంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, రౌండెడ్ స్క్రీన్ ఈ స్మార్ట్‌వాచ్ ప్రత్యేకత.
సాధారణంగా స్మార్ట్ఫోన్లకు ఫ్రంట్‌లో కెమెరా ఉన్నట్టుగానే.. దీనికి కూడా ఫ్రంట్‌లో కెమెరా ఉంటుంది. కర్వ్ షేప్‌లో ఎడ్జ్, వాచ్ కుడి వైపు కంట్రోల్ బటన్ లాంటి ఫీచర్లతో యాపిల్ వాచ్‌ను మించేలా మెటా ఈ స్మార్ట్‌వాచ్‌ను డిజైన్ చేస్తోంది. 2022 కల్లా ఈ వాచ్‌ను లాంచ్ చేయడానికి మెటా సన్నాహాలు చేస్తోంది.
రేబాన్ సాయంతో ఇటీవల ఫేస్బుక్ రిలీజ్ చేసిన స్మార్ట్ గ్లాసెస్‌ను ఈ స్మార్ట్‌వాచ్‌తో కంట్రోల్ చేయొచ్చు. మెటా ప్రస్తుతం వర్చువల్ రియాల్టీ హెడ్‌సెట్స్, పోర్టల్ వీడియో చాట్ డివైజ్‌లను కూడా విక్రయిస్తోంది.
త్వరలోనే హైఎండ్ హెడ్సెట్.. ప్రాజెక్ట్ కాంబ్రియాను కూడా లాంచ్ చేస్తామని మెటా ప్రకటించింది. ప్రాజెక్ట్ కాంబ్రియా అంటే వర్చువల్ రియాల్టీ, ఆగ్మెంటెడ్ రియాల్టీని మిక్స్ చేయడం. మెటా నుంచి రాబోయే ఈ స్మార్ట్‌వాచ్‌తో హెడ్‌సెట్స్‌ను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మెటా నుంచి లాంచ్ అయ్యే అన్ని డివైజ్‌లకు ఈ స్మార్ట్‌వాచ్ ఒక ఇన్పుట్ డివైజ్‌లా పనిచేయనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
WhatsApp : వచ్చే నెల నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఆ ఫోన్ల లిస్టు ఇదే
Facebook : ఫేస్బుక్ కొత్త పేరు ‘మెటా’ అర్థం ఏంటో తెలుసా? ఆ పేరునే మార్క్ ఎందుకు పెట్టాడు?
JioPhone Next : దివాళీకి జియోఫోన్ నెక్స్ట్ విడుదల.. కన్ఫమ్ చేసిన గూగుల్ సీఈవో
Diwali Offer : దివాళీ బంపర్ ఆఫర్.. రూ.101 కే వివో ఫోన్.. త్వరపడండి
యూజర్ చనిపోతే గూగుల్ డేటా ఏమవుతుంది? ఫొటోలు, వీడియోలు, ఇతర వివరాల సంగతేంటి?
WhatsApp : వాట్సప్ బిజినెస్ అకౌంట్లో సరికొత్త ఫీచర్