Facebook : ఫేస్బుక్ కొత్త పేరు ‘మెటా’ అర్థం ఏంటో తెలుసా? ఆ పేరునే మార్క్ ఎందుకు పెట్టాడు?
ఫేస్బుక్ కొత్త పేరు 'మెటా' అర్థం ఏంటో తెలుసా? | ఫేస్బుక్ కంపెనీకి ఇప్పుడు పేరెంట్ కంపెనీ మెటా. ఫేస్బుక్ కంపెనీ పేరును మారుస్తూ ఆ కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్
ఫేస్బుక్ కంపెనీకి ఇప్పుడు పేరెంట్ కంపెనీ మెటా. ఫేస్బుక్ కంపెనీ పేరును మారుస్తూ ఆ కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తాజాగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఫేస్బుక్ పేరును మెటా(Meta)గానే ఎందుకు మార్చారు? ఆ పేరును సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? అనే విషయాలు ప్రస్తుతం అందరికీ ఆసక్తిని కలిగిస్తున్నాయి.

నిజానికి మెటా అనే పదం ఇంగ్లీష్ పదం కాదు. అది గ్రీకు పదం. మెటా అంటే బియాండ్(beyond) అని అర్థం. బియాండ్ అంటే అంతకుమించి అని అర్థం వస్తుంది. మార్క్ దృష్టిలో ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది.. ఇంకా బిల్డ్ చేయాల్సింది చాలా ఉంది. కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గానే కాకుండా అంతకుమించిన టెక్నాలజీని డెవలప్ చేయాలి.. అనే అర్థం వచ్చేలా మెటా అనే పేరును మార్క్ ఎంచుకున్నాడు. ఇదే విషయాన్ని మార్క్ లైవ్‌లో స్పష్టం చేశాడు.
మనల్ని కేవలం ఒక సోషల్ మీడియా కంపెనీగానే చూస్తున్నారు. కానీ.. మనం ఈ ప్రపంచాన్ని ఒక్కటి చేసే టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాం. మనం అభివృద్ధి చేసే మెటావర్స్(metaverse) సోషల్ మీడియాకు మించి ఉంటుంది.. అని జుకర్‌బర్గ్ వెల్లడించాడు.
మరోవైపు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తమ పేరెంట్ కంపెనీ పేరును మార్చిన తొలి కంపెనీగా ఫేస్బుక్ నిలిచింది. ఈ ప్లాట్‌ఫామ్ కిందనే పలు యాప్స్, టెక్నాలజీలను కంపెనీ అభివృద్ధి చేయనుంది. అయితే.. ఫేస్బుక్ అనుబంధ ప్లాట్‌ఫామ్‌లు వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌ల పేర్లు మాత్రం అలాగే ఉంటాయి.
ఇప్పటికే మార్క్.. ఒక్యులస్(Oculus) పేరుతో వర్చువల్ రియాల్టీ ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేశాడు. ఇప్పుడు మెటా బ్రాండ్ కింద వర్చువల్ రియాల్టీ టెక్నాలజీని అభివృద్ధి చేయనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Facebook : ఫేస్బుక్ పేరును మార్చడానికి అసలు కారణం ఇదేనా? మార్క్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
Meta | మారిన పేరు.. ఫేస్బుక్ ఇక ‘మెటా’
Facebook Messenger : ఫేస్బుక్ వీడియో కాలింగ్‌లో సరికొత్త ఏఆర్ ఫీచర్.. ఎంజాయ్ చేస్తున్న యూజర్లు
Facebook plans to change name | ఫేస్బుక్ పేరు త్వరలో మారబోతున్నదా
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

