Facebook : ఫేస్బుక్ పేరును మార్చడానికి అసలు కారణం ఇదేనా? మార్క్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
ఫేస్బుక్ పేరును మార్చడానికి అసలు కారణం ఇదేనా? | ఇక నుంచి ఫేస్బుక్ ఉండదు. అంటే ఆ పేరు ఉండదు. దాన్ని మెటా(Meta)గా మారుస్తూ.. ఆ
ఇక నుంచి ఫేస్బుక్ కంపెనీ ఉండదు. అంటే ఆ పేరు ఉండదు. దాన్ని మెటా(Meta)గా మారుస్తూ.. ఆ కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తాజాగా నిర్ణయం తీసుకున్నాడు. అయితే.. ఇంత సడెన్‌గా ఫేస్బుక్ పేరును ఎందుకు మార్చినట్టు. ఫేస్బుక్ పేరు వల్ల మార్క్‌కు వచ్చిన సమస్య ఏంటి అనేదానిపై చాలామంది టెక్ నిపుణులు ఆలోచిస్తున్నారు.

ఇటీవల ఫేస్‌బుక్‌పై చాలా ఆరోపణలు వచ్చాయి. వాటన్నింటినీ కప్పిపుచ్చుకునేందుకు ఫేస్బుక్ వేస్తున్న మరో ఎత్తుగడ ఇది అంటూ కొందరు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నా.. పేరు మార్చడం వెనుక అసలు కారణం మెటావర్స్(Metaverse) అనే కొత్త ప్రాజెక్ట్ అని కొందరు అంటున్నారు.
ప్రస్తుతం మొబైల్ ఇంటర్నెట్ ఈ ప్రపంచాన్ని శాసిస్తోంది. కానీ.. వచ్చే మూడు నాలుగు ఏళ్లలో మెటావర్స్ ఈ ప్రపంచాన్ని శాసించబోతోంది. ఇది ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా పలు టెక్నాలజీలను ఫేస్బుక్ సంస్థ డెవలప్ చేస్తోంది.
ఇప్పటికే ఫేస్బుక్ ఒక సోషల్ మీడియా సంస్థగా అందరికీ సుపరిచితం అయింది. కానీ.. అంతకుమించి తన కంపెనీని ముందుకు తీసుకెళ్లాలనేదే మార్క్ ప్లాన్‌గా తెలుస్తోంది. ఫేస్బుక్ పేరుతోనే మెటావర్స్ ప్రాజెక్ట్‌ను కూడా తలపెడితే.. అది కూడా కేవలం మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అనే ధోరణి యూజర్లలో వస్తుందని.. అందుకే యూజర్లకు అంతకుమించిన ప్లాట్‌ఫామ్‌ను అందిస్తున్నారు కాబట్టి పేరు మార్చడమే బెటర్ అని మార్క్ ఆలోచించినట్టుగా తెలుస్తోంది.

మెటావర్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఫేస్బుక్ వర్చువల్ రియాల్టీ, ఆగ్మెంటెడ్ రియాల్టీని డెవలప్ చేస్తోంది. వీటి ద్వారా ఇంట్లో కూర్చొని వాస్తవిక ప్రపంచంలో అడుగుపెట్టొచ్చు. ప్రపంచంతో మాట్లాడొచ్చు. అసలు.. ఈ ప్రపంచం మొత్తాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవచ్చు. అందుకే ఇది రాబోయే తరంలో పెద్ద సంచలనం కాబోతోంది. టెక్నాలజీకే మెటావర్స్ సవాల్ విసరబోతోంది.
ఫేస్‌బుక్‌లోని హార్డ్‌వేర్ డివిజన్ ఫేస్బుక్ రియాల్టీ ల్యాబ్స్ మెటావర్స్ ప్రాజెక్ట్‌ను టేకప్ చేసింది. అది సపరేట్ వింగ్‌గా కొనసాగనుంది. మెటావర్స్ ప్రాజెక్ట్ కోసం ఫేస్బుక్ భారీగా ఇన్వెస్ట్ చేస్తుండటం వల్ల ఈ సంవత్సరం లాభాలు 10 బిలియన్ డాలర్లు తగ్గాయి. అంటే మన కరెన్సీలో రూ.74,795 కోట్లు అన్నమాట. అలాగే.. వచ్చే 5 ఏళ్ల లోపు ఫేస్బుక్ మెటావర్స్ ప్రాజెక్ట్ కోసం ఒక్క యూరప్‌లోనే 10,000 మంది ఉద్యోగులను నియమించుకోనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Meta | మారిన పేరు.. ఫేస్బుక్ ఇక ‘మెటా’
Facebook Messenger : ఫేస్బుక్ వీడియో కాలింగ్‌లో సరికొత్త ఏఆర్ ఫీచర్.. ఎంజాయ్ చేస్తున్న యూజర్లు
Facebook plans to change name | ఫేస్బుక్ పేరు త్వరలో మారబోతున్నదా
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

