WhatsApp : వాట్సప్ బిజినెస్ అకౌంట్లో సరికొత్త ఫీచర్
వాట్సప్ బిజినెస్ అకౌంట్లో సరికొత్త ఫీచర్ | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్.. బిజినెస్ యాప్‌ను కూడా రిలీజ్ చేసింది. తమ బిజినెస్ కోసం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్.. బిజినెస్ యాప్‌ను కూడా రిలీజ్ చేసింది. తమ బిజినెస్ కోసం ప్రత్యేకంగా బిజినెస్ అకౌంట్‌ను క్రియేట్ చేసుకునే వెసులుబాటును వాట్సప్ యూజర్లకు సంస్థ కల్పించింది. తాజాగా వాట్సప్ బిజినెస్ అకౌంట్లో సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్టు వాట్సప్ ప్రకటించింది.

వాట్సప్ బిజినెస్ అకౌంట్లో చాట్ చేసే మెసేజ్‌లకు రేటింగ్ ఇచ్చేలా కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. మెసేజ్ రేటింగ్ ఫీచర్‌ను ఉపయోగించుకొని.. యూజర్లు ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే త్వరలో అందుబాటులోకి రానుంది.
కొందరు ఐవోఎస్ యూజర్లకు కూడా ఈ ఫీచర్‌ను తీసుకురానున్నారు. మెసేజ్ రేటింగ్ ఫీచర్‌ను ఉపయోగించి స్టార్స్ రూపంలో రేటింగ్ ఇవ్వొచ్చు. ఇప్పటి వరకు వాట్సప్ బిజినెస్ అకౌంట్లో డైరెక్ట్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చే ఆప్షన్ లేదు.
వాట్సప్ బీటా యూజర్లు ఆండ్రాయిడ్ 2.21.22.7 వర్షన్‌ను ఉపయోగిస్తున్నవాళ్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. బిజినెస్ అకౌంట్ నుంచి వచ్చిన మెసేజ్‌లకు మాత్రమే రేటింగ్ ఇచ్చే చాన్స్ ఉంటుంది. రేటింగ్ ఇచ్చే వాట్సప్ యూజర్ వివరాలను వాట్సప్ వెల్లడించదు. దీంతో ఆ రేటింగ్ ఎవరు ఇచ్చారు అనే విషయాన్ని తెలుసుకోలేరు.
ఈ ఫీచర్ ద్వారా రేటింగ్ ఇవ్వాలని అనుకునేవాళ్లు.. వాట్సప్ బిజినెస్ చాట్ ఓపెన్ చేసి మెసేజ్‌ను సెలెక్ట్ చేసుకుంటే డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దాంట్లో కాపీ, రిపోర్ట్, రేట్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. అందులో రేట్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకొని రేటింగ్ ఇవ్వొచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఈ స్క్విడ్ గేమ్ యాప్‌ను వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి.. లేదంటే మీ ఫోన్ హ్యాకర్ల చేతికి వెళ్లినట్టే
WhatsApp : వచ్చే నెల నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఆ ఫోన్ల లిస్టు ఇదే
PhonePe: మొబైల్ రీచార్జ్‌పై ఫోన్‌పే ప్రాసెసింగ్ ఫీజు.. ఇలా అయితే కష్టం అంటున్న నెటిజన్లు
JioPhone Next : రూ.3500 కే జియో ఫోన్.. ఫీచర్లు చూస్తే అబ్బా అనాల్సిందే.. సేల్స్ ఎప్పుడంటే?
Android 12 for iQoo : ఐక్యూ ఫోన్లలో ఆండ్రాయిడ్ 12 బీటా వర్షన్
Android 12 : ఆండ్రాయిడ్ 12లో బగ్.. గూగుల్ పిక్సెల్ ఫోన్లలో సమస్యలు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

