Android 12 for iQoo : ఐక్యూ ఫోన్లలో ఆండ్రాయిడ్ 12 బీటా వర్షన్
ఐక్యూ ఫోన్లలో ఆండ్రాయిడ్ 12 బీటా వర్షన్ | ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్ ఐక్యూలలో ఆండ్రాయిడ్ 12 బీటా వర్షన్‌ను రిలీజ్ చేయనున్నారు.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్ ఐక్యూలలో ఆండ్రాయిడ్ 12 బీటా వర్షన్‌ను రిలీజ్ చేయనున్నారు. ఐక్యూ 7, ఐక్యూ 7 లెజెండ్, ఐక్యూ జెడ్ 3, ఐక్యూ జెడ్5, ఐక్యూ 3 ఫోన్లలో వచ్చే డిసెంబర్లో ఆండ్రాయిడ్ 12 బీటా వర్షన్‌ను లాంచ్ చేయనున్నారు. ఐక్యూతో పాటు ఒప్పో, రియల్మీ ఫోన్లలోనూ ఆండ్రాయిడ్ 12ను లాంచ్ చేయనున్నారు.

ఐక్యూ 3 ఫోన్లో మాత్రం 2022 మార్చి వరకు ఆండ్రాయిడ్ 12 బీటా వర్షన్‌ను అప్డేట్ చేయనున్నారు. ఐక్యూ 3ని గగత సంవత్సరం ఇండియాలో రిలీజ్ చేశారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ వర్షన్‌తో ఈఫోన్ రిలీజ్ అయింది. ఐక్యూ 7, ఐక్యూ 7 లెజెండ్, ఐక్యూ జెడ్ 3, ఐక్యూ జెడ్ 5 ఫోన్లను మాత్రం ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో విడుదల చేశారు.
మరో స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఇటీవలే కలర్ఓఎస్ 12 ఆధారిత ఆండ్రాయిడ్ 12 ను ప్రకటించింది. ఒప్పో, వన్‌ప్లస్ మోడల్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 12 బీటా వర్షన్‌ను అప్డేట్ చేయనున్నారు. మరో స్మార్ట్‌ఫోన్ కంపెనీ అసుస్ కూడా త్వరలోనే తన లేటెస్ట్ మోడల్స్ జెన్‌ఫోన్ 8, జెన్‌ఫోన్ 8 ఫ్లిప్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 12ను తీసుకురానున్నట్టు ప్రకటించింది. దాని కంటే ముందు జెన్‌ఫోన్ 7 లో ఆండ్రాయిడ్ 12 అప్డేట్ రానుంది.
ఇటీవలే గూగుల్ కంపెనీ.. తమ పిక్సెల్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 12 వర్షన్‌ను రిలీజ్ చేసింది. ప్రైవసీకి సంబంధించిన కొన్ని ఫీచర్లను ఆండ్రాయిడ్ 12లో అప్డేట్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Android 12 : ఆండ్రాయిడ్ 12లో బగ్.. గూగుల్ పిక్సెల్ ఫోన్లలో సమస్యలు
Amazon Sale : అమెజాన్ సేల్‌లో లాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్ ఇవే
Redmi Note 11 : రెడ్మీ నోట్ 11 సిరీస్ ధర, స్పెసిఫికేషన్లు ఇవే.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఆపిల్ ఆఫర్.. ఇండియాలో ఇంటెర్న్ల కోసం చూస్తున్న టెక్ జెయింట్
Facebook plans to change name | ఫేస్బుక్ పేరు త్వరలో మారబోతున్నదా
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

