PhonePe: మొబైల్ రీచార్జ్‌పై ఫోన్‌పే ప్రాసెసింగ్ ఫీజు.. ఇలా అయితే కష్టం అంటున్న నెటిజన్లు
మొబైల్ రీచార్జ్‌పై ఫోన్‌పే ప్రాసెసింగ్ ఫీజు | సాధారణంగా ఏ మొబైల్ వాలెట్లో అయినా సరే మొబైల్ రీచార్జ్ చేస్తే ప్రాసెసింగ్ ఫీజు ఉం
సాధారణంగా ఏ మొబైల్ వాలెట్లో అయినా సరే మొబైల్ రీచార్జ్ చేస్తే ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. రూపాయి కూడా ప్రాసెసింగ్ ఫీజు తీసుకోకుండా ఉచితంగా మొబైల్ రీచార్జ్ చేసుకోవచ్చు. కానీ.. తాజాగా ప్రముఖ మొబైల్ వాలెట్ యాప్ ఫోన్‌పే మాత్రం మొబైల్ రీచార్జ్‌పై ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తోంది. ఇది కేవలం కొన్ని రోజుల కోసం ఎక్స్పరిమెంట్ అంటూ ఫోన్‌పే చెబుతున్నప్పటికీ ఫోన్‌పే ద్వారా 50 రూపాయల కంటే ఎక్కువ రీచార్జ్ చేస్తే ప్రాసెసింగ్ ఫీజు కూడాఆ కట్ అవుతోంది. దీంతో ఫోన్‌పే వినియోగదారులు షాక్ అవుతున్నారు.

50 రూపాయల లోపు రీచార్జ్ చేసుకుంటే ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేదు. 50 నుంచి 100 రూపాయల లోపు రీచార్జ్ చేస్తే రూ.1 ప్రాసెసింగ్ ఫీజు, రూ.100 కంటే ఎక్కువ రీచార్జ్ చేస్తే రూ.2 ప్రాసెసింగ్ ఫీజును ఫోన్‌పే వసూలు చేస్తోంది. రీచార్జ్ ఎమౌంట్తో పాటే ప్రాసెసింగ్ ఫీజు కూడా కట్ అవుతుండటంతో వినియోగదారులు ఇలా అయితే కష్టం అని అంటున్నారు. మిగితా ఏ వాలెట్స్ కూడా ప్రాసెసింగ్ ఫీజు తీసుకోనప్పుడు కేవలం ఫోన్‌పే మాత్రం ఎందుకు ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటోందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
ఇది కేవలం ఒక చిన్న ఎక్స్పరిమెంట్ మాత్రమే. కొన్ని రోజుల వరకు మాత్రమే ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తాం. దీని ఫీడ్‌బ్యాక్‌ను బట్టి ప్రాసెసింగ్ ఫీజు ఉంచాలా? లేక తీసేయాలా? అనేది ఆలోచిస్తాం. ఇది కేవలం కొందరు యూజర్లకు మాత్రమే మొబైల్ రీచార్జ్ సమయంలో చాలా తక్కువ ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ మంది యూజర్లు కేవలం రూపాయి మాత్రమే చెల్లిస్తున్నారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ ద్వారా మొబైల్ రీచార్జ్ చేసుకునే కస్టమర్లు మాత్రమే ఈ ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది అంటూ ఫోన్‌పే స్పష్టం చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
JioPhone Next : రూ.3500 కే జియో ఫోన్.. ఫీచర్లు చూస్తే అబ్బా అనాల్సిందే.. సేల్స్ ఎప్పుడంటే?
Android 12 for iQoo : ఐక్యూ ఫోన్లలో ఆండ్రాయిడ్ 12 బీటా వర్షన్
Android 12 : ఆండ్రాయిడ్ 12లో బగ్.. గూగుల్ పిక్సెల్ ఫోన్లలో సమస్యలు
Amazon Sale : అమెజాన్ సేల్‌లో లాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్ ఇవే
Redmi Note 11 : రెడ్మీ నోట్ 11 సిరీస్ ధర, స్పెసిఫికేషన్లు ఇవే.. రిలీజ్ డేట్ ఫిక్స్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

