న్యూయార్క్ : ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో టెక్ దిగ్గజాలతో పాటు పలు కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. మాస్ లేఆఫ్స్ ట్రెండ్‌ను కొనసాగిస్తూ టెకీల్లో గుబులు రేపుతున్నాయి. తాజాగా గ్లోబల్ కన్సల్టింగ్ దిగ్గజం మెకిన్సీ ( McKinsey layoffs) ఏకంగా 2000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సన్నాహాలు చేపట్టిందని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది.
మెకిన్సీలో ప్రపంచవ్యాప్తంగా 45,000 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. క్లైంట్స్తో నేరుగా సంప్రదింపులు జరపని అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగులను తొలుత టార్గెట్ చేయవచ్చని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ పేర్కొంది. క్లైంట్స్తో సంప్రదింపులు జరిపే ఉద్యోగుల హైరింగ్ యధావిధిగా కొనసాగుతుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.వందేండ్ల కిందట చికాగోలో ఏర్పాటైన మెకిన్సీ ప్రస్తుతం 130 దేశాల్లో తన సేవలను విస్తరించింది. 2021లో కంపెనీ 15 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది.
రానున్న రెండు వారాల్లో లేఆఫ్స్‌పై కంపెనీ అధికారిక ప్రకటన చేస్తుందని భావిస్తున్నారు. ఇక ఆర్ధిక మందగమనంతో అమెరికాలోని పలు దిగ్గజ కంపెనీలు ఇటీవల లేఆఫ్స్‌ను చేపట్టాయి. ఇక ట్విట్టర్, మెటా, అమెజాన్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలతో పాటు గోల్డ్‌మన్ సాక్స్, మోర్గాన్ స్టాన్లీ వంటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఆడిటింగ్ కంపెనీలు సైతం ఇటీవల పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి.
Read More :