Layoffs | న్యూయార్క్: కష్టం కొత్త ఆలోచనకు పునాది కావాలని చెబుతున్నారు గూగుల్ మాజీ సీనియర్ మేనేజర్ హెన్రీ కిర్క్. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా గూగుల్ ఇటీవల ఆయనకు ఉద్వాసన పలికింది. దానికి ఆయన నిరాశ చెందకుండా కొత్త కంపెనీని స్థాపించాలనుకున్నారు. ఆయనలాగే ఉద్వాసనకు గురైన కొందరు కంపెనీ స్థాపనలో ఆయనకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. తమ కొత్త ప్రయాణ విశేషాలను హెన్రీ కిర్క్ లింక్డ్ఇన్లో పంచుకున్నారు.
‘నాకు ఇంక 52 రోజులే మిగిలి ఉంది. నాకు మీ సాయం కావాలి. కఠోర శ్రమ, ఫలితాలు మిమ్మల్ని జీవితంలో చాలా దూరం తీసుకెళతాయని నేను బలంగా విశ్వసిస్తాను. కానీ ఈ సందర్భం ఆ నమ్మకంపై సందేహాన్ని కలిగించవచ్చు. కానీ ఇలాంటి సవాళ్లు మనకు విభిన్నమైన అవకాశాలను కల్పిస్తాయి’ అని హెన్రీ పేర్కొన్నారు. తాను, 6 మంది గూగుల్ మాజీ ఉద్యోగులతో కలిసి న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలో డిజైన్ & డెవలప్మెంట్ స్టూడియోను ప్రారంభించబోతున్నామని ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఈ పని చేయడం కఠినమైనదని, కానీ ఇది ఎంతో ఉత్కంఠభరితమైన సవాల్ అని అన్నారు.