Wipro | విప్రో ‘సగం జీతం’ ఆఫర్.. ఫైర్ అవుతున్న ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్
Wipro | ప్రముఖ ఐటీ సంస్థ విప్రో (Wipro) ఫ్రెషర్స్ ( freshers)కు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదట ఆఫర్ చేసిన జీతంలో సగానికి పని చేయాలని కోరింది. విప్రో ఇచ్చిన ‘సగం జీతం’ ఆఫర్‌పై ఐటీ ఉద్యోగుల సంఘం (IT sector employees union) నైట్స్ (NITES) మండిపడుతోంది.
Wipro | ప్రముఖ ఐటీ సంస్థ విప్రో (Wipro) ఫ్రెషర్స్ ( freshers)కు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదట ఆఫర్ చేసిన జీతంలో సగానికి పని చేయాలని కోరింది. విప్రో ఇచ్చిన ‘సగం జీతం’ ఆఫర్‌పై ఐటీ ఉద్యోగుల సంఘం (IT sector employees union) నైట్స్ (NITES) మండిపడుతోంది.
విప్రో (Wipro) తీసుకున్న ఈ నిర్ణయం అన్యాయమని.. ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఈ నిర్ణయంపై మరోసారి పునరాలోచించాలని సూచించింది. ‘విప్రో తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వేతనాన్ని సగానికి తగ్గించుకోమని చెప్పడం అనైతికం. ఆర్థిక కష్టాల భారాన్ని ఉద్యోగులపై మోపుతారా..? ఈ నిర్ణయంపై కంపెనీ పునరాలోచన చేయాలి’ అని నైట్స్ అధ్యక్షుడు (President of NITES) హర్పీత్ సింగ్ సలౌజా (Harpreet Singh Saluja) అన్నారు. తమ సభ్యుల హక్కులకు భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోబోమన్నారు.
విప్రో.. 2022-23 వెలాసిటీ గ్రాడ్యుయేషన్ కేటగిరీలో (Velocity graduates program) శిక్షణ పూర్తిచేసుకున్న ఫ్రెషర్లకు గతంలో రూ.6.5 లక్షల వేతన ప్యాకేజీని ఆఫర్ చేసింది. శిక్షణ విజయవంతంగా పూర్తయిన వారిని 2023 మార్చి నుంచి రోల్స్‌లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించనుంది. అయితే వేతన ప్యాకేజీని మాత్రం రూ.6.50 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు తగ్గించుకుని విధుల్లో చేరాల్సిందిగా వాళ్లను కోరింది. ఈ మేరకు ఈ మెయిల్ ద్వారా తెలియజేసినట్లు ఓ ఆంగ్ల వెబ్సైట్ తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తమ వ్యాపార అవసరాలకు తగినట్టుగా నియామకాల్లో సర్దుబాట్లు చేసుకుంటున్నట్టు ఆ మెయిల్లో విప్రో (Wipro) పేర్కొంది. ఈ ఆఫర్‌కు అంగీకరించి వెంటనే విధుల్లో చేరాలని, దీనికి ఓకే అంటే గత ఆఫర్ రద్దవుతుందని తెలిపింది. కాగా, శిక్షణ సమయంలోనే పనితీరు సరిగా లేదంటూ 425 మందిని విప్రో ఇంటికి పంపిన విషయం తెలిసిందే.
Also Read..
Layoffs | గూగుల్ జాబ్‌లో నుంచి తీసేసిందని.. కొత్తగా కంపెనీ పెట్టిన ఉద్యోగులు
Air India | నియామకాలు చేపట్టిన ఎయిర్ ఇండియా.. వేతన ప్యాకేజీ రూ.2 కోట్లపైమాటే!
Ex-Googlers Company | గూగుల్ జాబ్ తీసేస్తే.. పోటీగా మరో ఆరుగురితో కొత్త కంపెనీ మొదలుపెట్టాడు
Wipro | ఫ్రెషర్స్‌కు విప్రో షాక్.. సగం జీతానికి పనిచేయాలంటూ ఈ-మెయిల్..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

