కాసేపు చేతిలో పట్టుకునే కర్చీఫ్నే మురికిగా ఉందనుకుంటూ ఉతికి ఆరేస్తామే. గంటలు గంటలు… రోజుల తరబడి చేతిలో ఉండే గ్యాడ్జెట్స్ పరిస్థితి ఏమిటి? వాటిని మాత్రం శుభ్రం చేయాల్సిన పన్లేదా? చాలాసార్లే అనిపిస్తూ ఉంటుంది. కానీ, అవకాశం లేక మిన్నకుండిపోతాం. గ్యాడ్జెట్లన్నిటికీ చాకిరేవు పెట్టేందుకూ, వాటిలోని మురికిని వదిలించేందుకూ సరికొత్తగా మార్కెట్లోకి వచ్చింది ‘పోర్ట్రానిక్స్ క్లీన్ ఎమ్’ పరికరం. సెల్ఫోన్లు, ట్యాబ్‌లాంటి వాటిని శుభ్రపరచడానికి అనువైన వస్త్రం, ద్రవాలు ఇందులో ఉంటాయి. ఛార్జింగ్ పాయింట్స్, స్పీకర్ రంధ్రాలు శుభ్రం చేసేందుకు సన్నని సూదిలాంటి పరికరాలూ దీంతోపాటే వస్తాయి. కీబోర్డును అడుగుభాగం నుంచీ క్లీన్ చేసేలా బ్రష్లూ ఉంటాయి. ఇయర్ బడ్స్‌ను, ఇయర్ బడ్స్ పెట్టుకునే డబ్బాలను తుడిచేందుకు కూడా ఇందులో ఏర్పాటు ఉంది. మీ గ్యాడ్జెట్లనూ ఉతికి ఆరేయాలనుకుంటే portronics.com వెబ్సైట్లోకి వెళ్లండి. ధర రూ.599 మాత్రమే!
ఇటీవల ఆటలాడుతూనో, కసరత్తు చేస్తూనో గుండెపోటుతో కుప్పకూలుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది. ఆ ప్రమాదాన్ని ముందే పసిగట్టి ప్రాణాలను పదిలంగా ఉంచేందుకు సాయపడుతుంది ‘ఫ్రాంటియర్ ఎక్స్2’ పరికరం. చిన్న స్ట్రిప్ ఆధారంగా దీన్ని ఛాతీకి అమర్చుకోవచ్చు. వ్యాయామం, రన్నింగ్, సైక్లింగ్ లాంటివి చేస్తున్నప్పుడు కూడా సులభంగా ఉపయోగించవచ్చు. ఈత కొట్టేప్పుడూ పనికొచ్చేలా వాటర్‌ప్రూఫ్‌గా తయారుచేశారు. గుండె కొట్టుకునే వేగం, శ్వాసరేటు, గుండెమీద పడుతున్న ఒత్తిడి.. లాంటివన్నీ ఈ పరికరం మానిటర్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు గుండెకు సంబంధించిన ఈసీజీనీ ఎప్పటికప్పుడు తీసి ఆప్ ద్వారా తెలియజేస్తుంది. గుండె పనితీరులో అసహజమైన మార్పులు చోటు చేసుకుని ఉంటే మాత్రం.. వైబ్రేట్ అవుతూ మనల్ని హెచ్చరిస్తుంది. ఆసక్తి ఉన్నవారు in.fourthfrontier.com ద్వారా కొనుక్కోవచ్చు. ఖరీదు రూ. 39,000.
ఎండలు మండే వేసవిలో నీళ్లను చూస్తే ప్రాణానికి హాయిగా అనిపిస్తుంది. వీలైతే ఆ నీటిలో ఆడుకోవాలనీ అనిపిస్తుంది. ఆటవిడుపుగా విహారయాత్రల్లో జలకాలాడేందుకు వాటర్ గన్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇందులో నీళ్లు నింపుకొని ఒకరిమీద ఒకరు చల్లుకోవడం మహా సరదాగా ఉంటుంది. స్పైరా సంస్థ ఎలక్ట్రిక్ వాటర్ గన్లు తయారుచేయడంలో పేరుమోసింది. ఇటీవల ‘స్పైరా త్రీ’ పేరిట మరో నీటి తుపాకీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. నీటి మీద ఆనిస్తే చాలు. అదే నీళ్లను నింపుకొనే ఈ గన్‌తో మామూలు మోడ్‌లో 30 అడుగుల దూరం దాకా, పవర్ మోడ్‌లో అయితే 50 అడుగుల దూరం దాకా నీళ్లు చిలకరించవచ్చు. అంతేకాదు నీళ్లు పడే వేగాన్ని బట్టి మూడు రకాల మోడ్‌లను సెట్ చేసుకోవచ్చు. spyra.com లో ఆర్డర్ చేసుకోవచ్చు. కాకపోతే ధర రూ.15వేల దాకా ఉంటుంది. ఆశలకు నీళ్లొదులుకొన్నారా?
ఫ్యాన్.. స్విచ్ వేయగానే గిరగిరా తిరుగుతుందనే మనకు తెలుసు. అంతకుమించిన ఫీచర్లతో అత్యాధునిక పంకాలు వస్తున్నాయి. కెంట్ ఆర్వో సిస్టమ్స్ సరికొత్తగా లాంచ్ చేసిన ‘కూల్ లగ్జస్ సీ5’ మోడల్.. అయిదు రెక్కలతో మరింత భిన్నంగా కనిపిస్తున్నది. ఇది రిమోట్‌తో పనిచేస్తుంది. లోపల ఎల్యీడీ లైట్లు కూడా ఉంటాయి. చాలా నిశ్శబ్దంగా, తక్కువ విద్యుత్తుతో సేవలు అందిస్తుంది. అపసవ్య దిశలో తిరిగేలానూ సెట్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే చలికాలంలో వెచ్చటి గాలిని ప్రసరింపజేస్తుంది. ఆసక్తి ఉంటే.. kuhl.in వెబ్సైట్లోకి వెళ్లి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ధర సుమారు రూ. 20 వేలు.
“Naya Mall | సన్ గ్లాసెస్ విత్ ఉడెన్ టచ్.. అదిరిపోయిన లేటెస్ట్ గ్యాడ్జెట్”
“Naya Mall |ఈ స్మార్ట్ రింగ్ మీ హార్ట్ రేట్ కూడా చెప్పేస్తుంది”