న్యూఢిల్లీ : యాపిల్ లేటెస్ట్ ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్ లాంఛ్ ఈవెంట్‌ను కంపెనీ సెప్టెంబర్ 13న నిర్వహించనుంది. బిగ్ స్మార్ట్‌ఫోన్ అనౌన్స్మెంట్ నేపధ్యంలో సెప్టెంబర్ 13న ఎలాంటి ముందస్తు కమిట్మెంట్స్కు దూరంగా ఉండాలని కంపెనీ తమ ఉద్యోగులకు సూచించినట్టు 9టూ5మ్యాక్ రిపోర్ట్ వెల్లడించింది. దీంతో సెప్టెంబర్ 13న ఐఫోన్ 15 సిరీస్ లాంఛ్ ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. లేటెస్ట్ ఐఫోన్ సిరీస్ లాంఛ్‌కు ఈ దిశగా యాపిల్ సంకేతాలు పంపిందని చెబుతున్నారు.
గతంలోనూ యాపిల్ సెప్టెంబర్‌లోనే లాంఛ్ ఈవెంట్స్ నిర్వహించడంతో ఈసారి కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 13న ఐఫోన్ 15 సిరీస్ లాంఛ్ ఖాయమైతే రాబోయే వారాల్లో కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక ఐఫోన్ 15 సిరీస్ స్పెసిఫికేషన్స్‌పై ఇప్పటికే పలు లీకులు వెల్లడయ్యాయి. ఐఫోన్ 14 ప్రొ సిరీస్ తరహాలో ఐఫోన్ 15 ప్రొ లైనప్‌లో ఎక్ల్సూజివ్ ఫీచర్స్‌ను యాపిల్ జోడించనుంది. న్యూ ఐఫోన్ 15 ప్రొ మోడల్స్ కీలక అప్‌గ్రేడ్స్‌తో కస్టమర్లను ఆకట్టుకోనున్నాయని సమాచారం.
ట్రెడిషనల్ లైట్నింగ్ పోర్ట్ నుంచి యూఎస్బీ-సీకి మారడంతో పాటు న్యూ పెరిస్కోప్ కెమెరా, యాపిల్ న్యూ ఏ17 చిప్సెట్ వంటి పలు మార్పులతో ఈ హాట్ డివైజ్‌లు కస్టమర్ల ముందుకు రానున్నాయి. ఐఫోన్ 15 ప్రొ, ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ డిజైన్ ఐఫోన్ 14 ప్రొ, ప్రొ మ్యాక్స్ మోడల్స్‌ను పోలి ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ డివైజ్‌లు వరుసగా 6.1 ఇంచ్, 6.7 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లేలతో పాటు డైనమిక్ ఐలండ్ ఫీచర్‌తో రానున్నాయని లీక్‌లు వెల్లడించాయి.
ఫ్లాట్ డిస్ప్లేలతో ఈ హాట్ డివైజ్‌లు ఆక్టుకుంటాయి. ఐఫోన్ 15 ప్రొ, ప్రొ మ్యాక్స్ మోడల్స్‌లో వాడే మెటీరియల్ స్టెయిన్లెస్ స్టీల్ నుంచి సైడ్ ఫ్రేమ్స్‌కు టైటానియం వాడనున్నట్టు చెబుతున్నారు. టైటానియం వాడటంతో ఈ డివైజ్‌లు తేలికగా, మన్నికగా ఉంటాయని చెబుతున్నారు. అయితే ఈ మెటీరియల్ వాడకంతో ఉత్పాదక వ్యయం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
Read More :