న్యూయార్క్ : ఈ ఏడాది జనవరిలో గూగుల్ 12,000 మంది ఉద్యోగులను (Google layoffs) తొలగించగా తాజాగా సెర్చింజన్ దిగ్గజం మాతృసంస్ధ అల్ఫాబెట్ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ యూనిట్ వేమో పలువురు ఉద్యోగులను సాగనంపింది. రెండో రౌండ్ లేఆఫ్స్‌లో భాగంగా వేమో ఇంజనీరింగ్ రోల్స్‌పై వేటు వేసింది. వేమోలో దాదాపు 137 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్టు పలు రిపోర్ట్స్ వెల్లడించాయి. వేమోలో ఇది రెండో విడత లేఆఫ్స్ కాగా ఇప్పటివరకూ కంపెనీలో 8 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు.
లేటెస్ట్ లేఆఫ్స్‌తో ఈ ఏడాది వేమో మొత్తం 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్టయింది. ఈ ఏడాది జనవరిలో ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించడంతో టెక్ ప్రపంచంలో కల్లోలం రేగింది. భారత్‌లోనూ గత నెలలో లేఆఫ్స్ ప్రారంభించిన గూగుల్ 400 మంది దేశీ ఉద్యోగులపై వేటు వేసింది.
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే తమను ఉన్నపళంగా తొలగించారని పలువురు గూగుల్ ఉద్యోగులు లింక్డిన్ పోస్ట్‌ల్లో వాపోయారు. భారత్‌లో కొలువు కోల్పోయిన గూగుల్ ఉద్యోగులకు పరిహార ప్యాకేజ్‌పైనా ఇప్పటివరకూ స్పష్టత లేదు. అమెరికాలో లేఆఫ్స్‌కు గురైన వారికి ప్రకటించిన పరిహార ప్యాకేజ్ తరహాలోనే భారత నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా దేశీ ఉద్యోగులకు కూడా గూగుల్ పరిహారం చెల్లించవచ్చని భావిస్తున్నారు.
Read More :