న్యూయార్క్ : ఏఐ ఆధారిత చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT) ఆవిష్కరణ అనంతరం దీనిపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. యూజర్లు అడిగే ప్రశ్నలకు మానవతరహాలో బదులివ్వడం, వ్యాసాలు రాయడం, కంపోజింగ్ పొయట్రీ, కోడ్ రాయడం, హోంవర్క్‌లో పిల్లలకు సాయపడటం సహా చిటికెలోనే సొల్యూషన్స్ అందిస్తుండటంతో ఈ ఏఐ టూల్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. మరోవైపు లాంఛ్ అయిన రెండు నెలల్లోనే చాట్‌జీపీటీ ఏకంగా 200కుపైగా బుక్స్ రాయడం, సహ-రచయితగా వ్యవహరించడం సంచలనం సృష్టిస్తోంది.
చాట్‌జీపీటీ రచయితగా వందల పుస్తకాలు అందుబాటులో ఉన్నట్టు అమెజాన్ బుక్ స్టోర్ లిస్టింగ్‌లో వెల్లడైంది. వైరల్ చాట్‌బాట్ సృష్టికర్త ఓపెన్ఏఐ 2015లో ప్రారంభమైంది. ఇక గతంలో గూగుల్, ఫేస్‌బుక్‌తో పాటు అమెజాన్, యాపిల్ వంటి టెక్ దిగ్గజాల్లో పనిచేసిన పలువురు ఉద్యోగులు ప్రస్తుతం ఓపెన్ఏఐ టీమ్స్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. డజన్ల కొద్దీ ఆయా కంపెనీల మాజీ ఉద్యోగులు చాట్‌జీపీటీలో సేవలందిస్తున్నారు.
ఓపెన్ఏఐలో ప్రస్తుతం 59 మంది గూగుల్ మాజీ ఉద్యోగులు, 34 మంది మెటా మాజీ ఉద్యోగులు పనిచేస్తున్నారని బిజినెస్ ఇన్సైడర్ రిపోర్ట్ తెలిపింది. ఇక అమెజాన్, యాపిల్ మాజీ ఉద్యోగులు కూడా పలువురు ఈ కంపెనీలో ఉన్నారు. గతంలో మెటా, గూగుల్, యాపిల్ వంటి కంపెనీల్లో పనిచేసిన వారే ఓపెన్ఏఐ నాయకత్వ స్ధానాల్లో ప్రధానంగా కొలువుతీరారని ఈ రిపోర్ట్ పేర్కొంది.
Read More :
ChatGPT | 200 బుక్స్ రాసిన చాట్‌జీపీటీ : అమెజాన్ బుక్‌స్టోర్ లిస్టింగ్‌లో వెల్లడి