ChatGPT | 200 బుక్స్ రాసిన చాట్‌జీపీటీ : అమెజాన్ బుక్‌స్టోర్ లిస్టింగ్‌లో వెల్లడి
ఓపెన్ఏఐ ఆధారిత చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT) టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. లాంఛ్ అయిన రెండు నెలలకే చాట్‌జీపీటీ ఏకంగా 200కుపైగా పుస్తకాలు రాసి చేయితిరిగిన రచయితగా అవతరించింది.
న్యూఢిల్లీ : ఓపెన్ఏఐ ఆధారిత చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT) టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. లాంఛ్ అయిన రెండు నెలలకే చాట్‌జీపీటీ ఏకంగా 200కుపైగా పుస్తకాలు రాసి చేయితిరిగిన రచయితగా అవతరించింది. 200కు పైగా పుస్తకాలకు చాట్‌జీపీటీని రచయితగా అమెజాన్ బుక్ స్టోర్ లిస్టింగ్ వెల్లడించింది. ఓపెన్ఏఐ రాసిన, సహ రచయితగా ఉన్న 200కుపైగా పుస్తకాలను అమెజాన్ నుంచి ఈబుక్స్ లేదా పేపర్‌బ్యాక్ బుక్స్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఫిబ్రవరిలో అమెజాన్ కిండల్ స్టోర్‌లో చాట్‌జీపీటీని రచయిత, సహ రచయితగా పేర్కొన్న 200కుపైగా ఈ బుక్స్ ఉన్నాయి. చాట్‌జీపీటీని ఉపయోగించి కంటెంట్‌ను రాయడం, క్రియేట్ చేయడం ఎలా, ది పవర్ ఆఫ్ హోం వర్క్, ఎకోస్ ఆఫ్ ది యూనివర్స్ వంటి టైటిల్స్‌తో ఈ బుక్స్ సిద్ధమయ్యాయి.చాట్‌జీపీటీ రచయిత, సహ రచయితగా వెలువడే పుస్తకాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఏఐ టూల్స్ గురించి సమగ్రంగా వివరించే చాట్‌జీపీటీ ఆన్ చాట్‌జీపీటీ, ఏఐ ఎక్స్ప్లైన్స్ అనే మరో బుక్ పూర్తిగా చాట్‌జీపీటీ రాసింది.
ఈ బుక్ కిండిల్‌లో ఉచితంగా అందుబాటులో ఉండగా ప్రింట్ వెర్షన్ బుక్ 11.99 డాలర్లకు లభిస్తుంది. కాగా తాను ఏఐ చాట్‌బాట్‌ను ఉపయోగించి బుక్ రాశానని శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ఫైనాన్షియల్ టెక్ కంపెనీలో పనిచేసే ప్రోడక్ట్ డిజైన్ మేనేజర్ అమ్మర్ రేషీ చెప్పారు. మనుషుల తరపున చాట్‌జీపీటీ పుస్తకాలను రాయడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్ధితి ఆందోళనకరమని ఇలాగైతే రచయితలు తమ ఉద్యోగాలు కోల్పోతారని ఆథర్స్ గిల్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేరీ రెసెన్బర్గర్ అన్నారు. చాట్‌జీపీటీ పుస్తకాలు మార్కెట్లోకి వెల్లువెత్తితే పెద్దసంఖ్యలో రచయితలకు ఉపాధి కరువవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :
Poco C55 | దేశీయ మార్కెట్లోకి బడ్జెట్ ధరలోనే పొకో సీ-55.. ధరెంతంటే?!
Ex-Googlers Company | గూగుల్ జాబ్ తీసేస్తే.. పోటీగా మరో ఆరుగురితో కొత్త కంపెనీ మొదలుపెట్టాడు
Layoffs | 1400 మంది ఉద్యోగులపై ఎరిక్సన్ వేటు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

