Poco C55 | దేశీయ మార్కెట్లోకి బడ్జెట్ ధరలోనే పొకో సీ-55.. ధరెంతంటే?!
Poco C55 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ పొకో.. తన సీ-సిరీస్ ఎంట్రీ లెవల్ బడ్జెట్ ఫోన్ సీ-55ను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Poco C55 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో.. భారత్ మార్కెట్లోకి తన సీ- సిరీస్ ఫోన్లలో ఎంట్రీ లెవెల్ ఫోన్ సీ-55 (Poco C55 )ను మంగళవారం ఆవిష్కరించింది. రెండు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. బడ్జెట్ ధరలోనే సీ-55 ఫోన్ (Poco C55 ) లభిస్తుంది. 50-మెగా పిక్సెల్ కెమెరా, 10 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన పొకో సీ-55 ధర రూ.9,499, రూ.10,999గా నిర్ణయించింది.
ఈ ఫోన్ 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో పొకో సీ-55 వస్తున్నది. కూల్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్, పవర్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. 4జీబీ రామ్ వేరియంట్ ఫోన్ రూ.9,4999, 6జీబీ రామ్ వేరియంట్ రూ.10,999లకు కొనుగోలు చేయొచ్చు. ఈ నెల 28 నుంచి ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు పొకో వైబ్సైట్లలో ఆర్డర్ చేసుకోవచ్చు.
హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ కార్డ్, ఐసీఐసీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై తొలిరోజు ఈ ఫోన్ కొనుగోలు చేసిన వారు ఇన్‌స్టంట్‌గా రూ.500 నుంచి రూ.1000 వరకు రాయితీ పొందొచ్చు. 4జీబీ వేరియంట్ ఫోన్‌పై తొలి రోజు రూ.500 డిస్కౌంట్ అదనం. కనుక తొలి రోజు కొనుగోలు చేసిన వారికి 4జీబీ వేరియంట్ ఫోన్ రూ.8,499, 6జీబీ వేరియంట్ ఫోన్ రూ.9,999లకే లభిస్తుంది. మీడియాటెక్ హెలియో జీ85 చిప్సెట్తో వస్తున్నది.
ఈ ఫోన్ 50 మెగా పిక్సెల్ డ్యుయల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం ఫ్రంట్‌లో 5-మెగా పిక్సెల్ స్నాపర్ కలిగి ఉంటుంది. 1080 @30ఎఫ్‌పీఎస్, 720@ 30 ఎఫ్‌పీఎస్ వద్ద వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతో వస్తున్నది. ఇది ఆండ్రాయిడ్ 12 వర్షన్‌పై పని చేస్తుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

