ఫేస్బుక్ కంపెనీ పేరును మెటాగా మారుస్తూ ఆ కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. తమ పేరెంట్ కంపెనీ పేరు మెటా అనే విషయం ప్రపంచానికి తెలియడం కోసం మార్క్ జుకర్‌బర్గ్ మెటా బ్రాండింగ్ ప్రమోషన్ స్టార్ట్ చేశాడు.
ఇప్పటి వరకు ఫేస్బుక్ కంపెనీ నుంచి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మెసెంజర్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా అప్లికేషన్లు రన్ అయ్యేవి. కానీ.. ఇక నుంచి ఆ యాప్స్ అన్నీ మెటా కంపెనీ నుంచి రన్ అవుతాయి. వాటికి పేరెంట్ కంపెనీ మెటా. అందుకే.. వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ అప్లికేషన్లలో యాప్ ఓపెన్ చేసే సమయంలోనే ఫ్రమ్ మెటా(from meta) అని యాడ్ చేసి మెటా లోగోను కూడా డిస్ప్లే చేస్తున్నారు. ఇదివరకు దీని ప్లేస్‌లో ఫ్రమ్ ఫేస్బుక్ అనే పేరు ఉండేది. మెటా బ్రాండింగ్‌ను లేటెస్ట్ వర్షన్లకు యాప్స్‌ను అప్డేట్ చేసుకుంటే చూడొచ్చు.
ఇక.. మెటా బ్రాండ్ కింద మార్క్ జుకర్‌బర్గ్.. మెటావర్స్ అనే ప్రాజెక్ట్‌ను తలపెట్టాడు. ఇదో వర్చువల్ ప్రపంచం. మెటావర్స్ ద్వారా వర్చువల్ రియాల్టీ, ఆగ్మెంటెడ్ రియాల్టీని డెవలప్ చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాకు మించిన ఊహా ప్రపంచం. దీని ద్వారా.. ఇంట్లోనే కూర్చొని వీఆర్ హెడ్సెట్ పెట్టుకొని ప్రపంచాన్ని చుట్టి రావచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
WhatsApp : వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. మల్టీ డివైజ్ సపోర్ట్.. ఎనేబుల్ చేసుకోండిలా
VPN | వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ప్రయోజనాలేంటి..?