e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ Facebook plans to change name | ఫేస్‌బుక్‌ పేరు త్వరలో మారబోతున్నదా

Facebook plans to change name | ఫేస్‌బుక్‌ పేరు త్వరలో మారబోతున్నదా

metaverse | Facebook name change | mark zuckerberg

Facebook plans to change company name: ఫేస్‌బుక్‌ పేరు త్వరలో మారబోతున్నదా.. తాము కొత్తగా అందుబాటులోకి తీసుకురాబోతున్న మెటావర్స్‌ ( metaverse )కు ఎక్కువ ప్రచారం కల్పించేలా సంస్థ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ( mark zuckerberg ) కొత్త పేరును పెట్టబోతున్నారా.. అంటే అవుననే తెలుస్తున్నది. ఫేస్‌బుక్‌ సంస్థ ఈ నెల 28న నిర్వహించే కనెక్ట్‌ కాన్ఫరెన్స్‌లో జుకర్‌బర్గ్‌ సంస్థ కొత్త పేరును ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఇందులో ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, ఒక్యులస్‌లాగే ఫేస్‌బుక్‌ను కూడా ఒక అనుబంధ కంపెనీగా చూపిస్తారని, సంస్థ పేరు మెటావర్స్‌ ప్లాట్‌ఫాం మీదుగా ఉంటుందని తెలుస్తున్నది. మెటావర్స్‌ ( metaverse ) అనేది కొత్త తరహా కమ్యూనికేషన్‌ విధానం. వర్చువల్‌ విధానంతో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది.. కలిసి ఉన్న, ఒకరినొకరు తాకుతున్న భావనతో ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మాట్లాడుకోవచ్చు. దీనినే మెటావర్స్‌ అంటారు. వర్చువల్‌/ఆగ్యుమెంట్‌ రియాలిటీతో ఇది సాధ్యం అవుతుంది.

522 కోట్ల ఫైన్‌

లండన్‌: ఫేస్‌బుక్‌కు బ్రిటన్‌ రూ.522 కోట్ల జరిమానాను విధించింది. దర్యాప్తునకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వనందుకు ఈ ఫైన్‌ వేసినట్టు అధికారులు తెలిపారు. జిఫీ సంస్థను ఫేస్‌బుక్‌ గతేడాది కొనుగోలు చేసింది. అయితే, ఈ కొనుగోలు ద్వారా సామాజిక మాధ్యమాల మధ్య పోటీని ఫేస్‌బుక్‌ నియంత్రిస్తున్నదన్న ఆరోపణలపైబ్రిటన్‌ కాంపిటీషన్‌ అండ్‌ మార్కెట్స్‌ అథారిటీ ఈ విచారణ చేపట్టింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Facebook : ఆ ఫేస్‌బుక్ అకౌంట్‌, టూల్‌ను బ్యాన్ చేసిన ఫేస్‌బుక్‌.. కార‌ణం ఏంటి?

Facebook Post | ఫేస్‌బుక్‌ ఫొటోతో కటకటాలపాలైన వ్యక్తి.. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే?

Facebook | ఫేస్‌బుక్ బండారం బ‌ట్ట‌బ‌య‌లు.. ఆ మ‌హిళ లైవ్‌లోకి వ‌చ్చిన వెంట‌నే సేవ‌లు బంద్‌

How to Lock Facebook Profile : ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేయడం ఎలా?

Facebook : ఇక నుంచి ఫేస్‌బుక్ యాప్ నుంచే వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవ‌చ్చు

న‌కిలీ ఫేస్‌బుక్ ఖాతాల‌తో మోసాలు.. మిమ్మ‌ల్ని డ‌బ్బులు అడిగేది మీ ఫ్రెండేనా కాదా ఇలా గుర్తించండి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement