Harish Rao | మా ఎంపీలు సభలో ఉంటే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సంగతి తేల్చిపారేసేవాళ్లు : హరీష్రావు
Harish Rao | తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పార్లమెంట్ వేదికగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచిన తేజస్వి సూర్య వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Harish Rao : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పార్లమెంట్ వేదికగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచిన తేజస్వి సూర్య వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల పోరాటం, వేలాది మంది యువతీ యువకుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను, రక్తపాతంతో కూడిన దేశ విభజనతో పోల్చడం అమరవీరుల త్యాగాలను అవమానించడమేనని మండిపడ్డారు.
ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలే గనుక సభలో ఉండి ఉంటే తేజస్వి సూర్య సంగతి తేల్చిపారేసేవారని హరీష్రావు అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా జరిగిందని గుర్తుచేసిన హరీశ్ రావు.. ఈ రాష్ట్రం నేడు దేశానికే ఆదర్శంగా నిలవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. ఒకవేళ తెలంగాణ ఏర్పాటు భారత్-పాక్ విభజన వంటిదే అయితే, ఆనాడు పార్లమెంట్లో బీజేపీ ఈ బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చిందని ప్రశ్నించారు.
గతంలో ప్రధాని మోదీ కూడా రాష్ట్ర ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు తేజస్వి సూర్య అదేబాటలో నడుస్తూ విషం చిమ్ముతున్నారని హరీష్రావు ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మౌనాన్ని హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి, ఢిల్లీ పెద్దల ముందు రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవంపై దాడిచేసే శక్తులను ఇక్కడి ప్రజలు ఎన్నడూ క్షమించరని, త్యాగాల చరిత్రను అగౌరవపరిస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

