Sachin Tendulkar | దోస్త్ ప్రాణాలు కాపాడేందుకు వాట్సాప్ గ్రూప్.. ఆపన్న హస్తం అందించిన సచిన్..!
Sachin Tendulkar : తన చిన్నప్పటి దోస్త్ కాంబ్లీని మునపటి మనిషిని చేసేందుకు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ముందుకొచ్చాడు. ఇప్పటికే కాంబ్లీకి పలుమార్లు ఆర్ధిక సాయం చేసిన సచిన్ ఈసారి వాట్సాప్ గ్రూప్లో భాగమయ్యాడు.
Sachin Tendulkar : భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (Vinod Kambli) కొన్నాళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి అతడు కోలుకున్నట్టే కనిపిస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో మెరుగవ్వలేదు. ఇటీవలే కాంబ్లీ ఆరోగ్యం క్షీణించసాగింది. దాంతో, తన చిన్నప్పటి దోస్త్ కాంబ్లీని మునపటి మనిషిని చేసేందుకు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ముందుకొచ్చాడు. ఇప్పటికే కాంబ్లీకి పలుమార్లు ఆర్ధిక సాయం చేసిన సచిన్ ఈసారి వాట్సాప్ గ్రూప్లో భాగమయ్యాడు.
ఏడాది క్రితం మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్తో వినోద్ కాంబ్లీ ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతానికి అతడు ఆ సమస్య నుంచి కొద్దికొద్దిగా బయటపడుతున్నాడు. అయితే.. కాంబ్లీకి పక్షవాతం (Paralysis) వచ్చే అకాశముందని వైద్యులు తెలిపారు. మెదడులో రక్తం గడ్డ కట్టిందని, చికిత్స ఆలస్యమైనందున అతడు స్ట్రోక్ ముప్పును ఎదుర్కొంటున్నాడని చెప్పారు. గత కొన్ని రోజులుగా కాంబ్లీ ఆరోగ్యం కాస్త మెరుగ్గానే ఉంది. నడవగలుగుతున్నాడు కానీ, అతడి జ్ఞాపకశక్తి మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
Vinod Kambli continues his recovery amid serious health concerns, including risk of brain stroke. Sachin Tendulkar has joined a support group led by friends offering financial and emotional help
Read more here:https://t.co/CIdn0CLE9b#VinodKambli #brainstroke #sachintendulkar pic.twitter.com/jaSS0pi4Dk
— IndiaTV English (@indiatv) April 16, 2026
తరచూ చెకప్లు, ట్రీట్మెంట్ కారణంగా కాంబ్లీ వైద్యానికి అవసరమైన ఖర్చులు పెరగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అతడికి మరింత ఆర్ధిక సాయం, మానసిక మద్దతు కోసం స్నేహితుడైన మార్కస్ కౌటో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. ఇందులో మాజీ ఆటగాళ్లు, కాంబ్లీ స్నేహితులు సభ్యులుగా ఉన్నారు.
‘కాంబ్లీ స్నేహితులు, మాజీ ఆటగాళ్లతో కలిపి ఒక వాట్సా్ప్ గ్రూప్ క్రియేట్ చేశాను. వీరంతా ఆర్ధికంగా ఎంతో సాయం చేశారు’ అని మార్కస్ వెల్లడించాడు. ఒకప్పుడు తనతో కలిసి ఆడిన కాంబ్లీకి సాయం చేసేందుకు వాట్సాస్ గ్రూప్లో చేరిన సచిన్.. ఆపన్న హస్తం అందిస్తున్నాడు. ఇదివరకు మాజీ ఆటగాళ్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్.. వంటివాళ్లు కాంబ్లీకి ఆర్ధిక సాయం చేసిన విషయం తెలిసిందే.
#WATCH | Maharashtra: Former Indian Cricketer Vinod Kambli was hospitalised at a private hospital in Thane after his health deteriorated on Saturday night. pic.twitter.com/nYlVbSIwlh
— ANI (@ANI) December 24, 2024
చిన్నప్పటి నుంచి దోస్తులైన సచిన్, కాంబ్లీలు స్కూల్ వయసులోనే క్రికెట్లో సంచనం సృష్టించారు. 1988లో హ్యారిస్ షీల్డ్ టోర్నమెంట్లో విధ్వంసక ఆటతో విరుచుకుపడిన ఈ ఇద్దరు 664 పరుగులతో రికార్డు నెలకొల్పారు. భారత జట్టుకు ఆడిన కాంబ్లీ అత్యంత వేగంగా 10 వేల పరుగులు చేసినప్పటికీ.. సచిన్ లెక్క సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

