Pakistan Navy: స్వదేశీ యాంటీషిప్ మిస్సైల్‌ను పరీక్షించిన పాక్ నేవీ
Pakistan Navy : స్వదేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీషిప్ మిస్సైల్‌ను ఇవాళ పాకిస్థాన్ నేవీ విజయవంతంగా పరీక్షించింది. చాలా దూరంలో ఉన్న టార్గెట్లను ఆ మిస్సైల్ చేరుకోగలదని పాక్ మిలిటరీ పేర్కొన్నది.
కరాచీ: స్వదేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీషిప్ మిస్సైల్‌ను ఇవాళ పాకిస్థాన్ నేవీ(Pakistan Navy ) విజయవంతంగా పరీక్షించింది. చాలా దూరంలో ఉన్న టార్గెట్లను ఆ మిస్సైల్ చేరుకోగలదని పాక్ మిలిటరీ పేర్కొన్నది. నౌకల నుంచి లాంచ్ చేసే ఆ యాంటీషిప్ మిస్సైల్‌ను నేవీ విజయవంతంగా పరీక్షించినట్లు ఐఎస్పీఆర్ ప్రకటించింది. నేవీ చీఫ్ అడ్మిరల్ నవీద్ అష్రఫ్తో పాటు ఇతర శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు .. మిస్సైల్ ఫైరింగ్ ఈవెంట్‌ను వీక్షించారు. అత్యాధునిక గైడెన్స్ సిస్టమ్‌తో పాటు అడ్వాన్స్డ్ మాన్యువరబులిటీ ఉన్నట్లు పేర్కొన్నారు. శత్రవుల క్షిపణుల నుంచి తప్పించుకునే సామర్థ్యం ఉన్నట్లు ప్రకటనలో తెలిపారు. పరిస్థితులకు తగినట్లు డైనమిక్‌గా మారుతుందని, చాలా కచ్చితత్వంతో ఆ క్షిపణి ప్రాణాంతకంగా మారుతుందని మిలిటరీ పేర్కొన్నది. ప్రాంతీయ సముద్ర భద్రత, స్థిరత్వం నేపథ్యంలో మిస్సైల్ ఫైరింగ్ ఈవెంట్ నిర్వహించినట్లు చెప్పారు. అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి, ప్రధాని షెహబాజ్ షరీఫ్, సీడీఎఫ్ అసిమ్ మునీర్ తాజా పరీక్ష పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

