బీబీనగర్, జూలై 28 : బీబీనగర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంలో గౌరవ సలహాదారులుగా ఆరుముళ్ల సుదర్శన్, గోస్కొండ సంజీవరావు, అధ్యక్షుడిగా బొమ్మగాని గురులింగం గౌడ్, ఉపాధ్యక్షుడిగా దిగోజు నాగచారి, కాటపల్లి అంజనేయులు గౌడ్, ప్రధాన కార్యదర్శిగా రావుల నవీన్ కుమార్, సహాయ కార్యదర్శిగా నెల్లుట్ల బాలకృష్ణ, కోశాధికారిగా మైల సాయిరాం, కార్యవర్గ సభ్యులుగా మొరిగాడి శ్రీనివాస్ గౌడ్, నెల్లుట్ల శ్రీశైలం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించి పలువురు జర్నలిస్టులు అభినందనలు తెలిపారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధితో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సమిష్టిగా పని చేస్తామని నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు.