కారేపల్లి, జూలై 28 : సింగరేణి మండలానికి మంజూరైన రెవెన్యూ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాస్ మంగళవారం స్థానిక తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పీడీ మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో తిరుమలాయపాలెం, సింగరేణి, మధిర, ముదిగొండలకు నూతన తాసీల్దార్ కార్యాలయాలకు నూతన భవనాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఒక్కొక్క భవనాన్ని రూ.2.25 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. సింగరేణి మండల కేంద్రంలో ప్రస్తుతం ఉన్న కార్యాలయాన్ని వెంటనే ఖాళీ చేసి తమకు అప్పగించాలని తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లను పీడీ శ్రీనివాస్ కోరారు. ఈ పరిశీలనలో పీడీ వెంట హౌసింగ్ డీఈ జగ్రామ్, ఏఈలు నాగేంద్రబాబు, స్వప్న ఉన్నారు.