పాల్వంచ, ఏప్రిల్ 16 : పాల్వంచకు చెందిన బరపటి సీతారాములు 18వ వర్ధంతిని సిపిఎం పాల్వంచ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఎం టౌన్ కార్యదర్శి వర్గ కమిటి సభ్యులు కాతోజు సత్య అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటి సభ్యుడు అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ.. పాల్వంచ పరిసర ప్రాంత గిరిజన, రైతు కూలి సమస్యలపై నిరంతరం అలుపెరగని పోరాటం చేసిన ధన్యజీవి బరపటి సీతారాములు అని, పార్టీ నిర్మాణం పట్ల, పోరాటాల పట్ల పూర్తి అవగాహనతో పనిచేసే వారని కొనియాడారు. అలాంటి నిర్మాణ దక్షుడిని కోల్పోవడం పార్టీకి తీరని నష్టం అని ఇప్పటి మత ఉన్మాద, దేశద్రోహులు అధికారంలో ఉన్న సమయంలో బరపటి సీతారాములు ఆశయాలకు అనుగుణంగా పని చేయడమే ఆయానికిచ్చే నిజమైన నివాళి అన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.జ్యోతి మాట్లాడుతూ నేటి ఉద్యమకారులకు స్ఫూర్తి ప్రదాత ఈ మండలంలో ఉన్న గిరిజనుల కోసం ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి వారి కుటంబంలో ఒక్కటిగా ఉండేవారు కొత్తగూడెం మార్కిస్ట్ పార్టీ నిర్మాత ఆయన బరపాటికి విప్లవ నివాళులు అర్పించారు. ఈ కార్య క్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అన్నవరపు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు దొడ్డ రవికుమార్, కొండబోయిన వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి పొదిలి తులసి రామ్, కార్యదర్శి వర్గ సభ్యులు వి.వాణి, ఎస్కే. నిరంజన్, పట్టణ కమిటీ సభ్యులు బి.మాధవి. ఇంజ రాములు, ఇ.రాములు, సీనియర్ నాయకులు టి.కృష్ణమూర్తి, ఎం.వీ.అప్పారావు. శంకరన్న పాల్గొన్నారు.