Facebook Post | ఫేస్బుక్ ఫొటోతో కటకటాలపాలైన వ్యక్తి.. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే?
Facebook Post | మోటార్ వాహనాల్లో ఉపయోగించే కేటలిటిక్ కన్వర్టర్ అమ్మాలనుకున్నాడో యువకుడు. అందుకోసం దాని ఫొటో తీసి ఫేస్బుక్ మార్కెట్‌ప్లేస్‌లో పోస్టు చేశాడు.

వాషింగ్టన్: మోటార్ వాహనాల్లో ఉపయోగించే కేటలిటిక్ కన్వర్టర్ అమ్మాలనుకున్నాడో యువకుడు. అందుకోసం దాని ఫొటో తీసి ఫేస్బుక్ మార్కెట్‌ప్లేస్‌లో పోస్టు చేశాడు. అయితే ఆ ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న కొన్ని వస్తువులను తీసేయడం మర్చిపోయాడు. దీంతో చివరకు కటకటాలపాలయ్యాడు. ఇంతకీ అతను తీయడం మర్చిపోయిన వస్తువేంటో తెలుసా? మెథాంఫెటమైన్. దీన్ని సింపుల్‌గా మెత్ అని కూడా పిలుస్తారు. అంటే డ్రగ్స్ అన్నమాట.
ఈ మెత్ ప్యాకెట్ పక్కనే ఒక ఇంజెక్షన్ సూది కూడా పెట్టుకున్నాడు జేమ్స్ కర్ట్జ్ అనే వ్యక్తి. అమెరికాలోని మిస్సోరీ ఇతని సొంత రాష్ట్రం. కేటలిటిక్ కన్వర్టర్ అమ్మకం ఫొటోలో ఇలా మెత్ కనిపించడంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. అంతే వెంటనే సదరు వ్యక్తి ఇంటిపై పోలీసులు రెయిడ్ చేశారు. అతని ఇంట్లో 48 గ్రాముల మెత్తోపాటు, ఒక లైసెన్స్ లేని రివాల్వర్ కూడా పోలీసులకు దొరికింది. రెంటినీ స్వాధీనం చేసుకొని, ఆ ఇంటి యజమాని చేతికి బేడీలు వేశారు.

ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన కొందరు ఫేస్బుక్ యూజర్లు, ‘ఇంతకన్నా నవ్వు తెప్పించే పోస్టు ఈ మధ్య కాలంలో చూడలేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

