Disney+ Hotstar | ప్రముఖ భారత ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సరికొత్త నెలవారి ప్లాన్‌ను తన యూజర్ల కోసం తీసుకొచ్చింది. అది కేవలం రూ.49 ప్లాన్. రూ.49 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే నెల వరకు మొబైల్లో అన్నింటికీ యాక్సెస్ లభిస్తుంది. అయితే.. ఈ ఆఫర్ కొందరికే తీసుకొచ్చింది హాట్‌స్టార్. సెలెక్టెడ్ యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ ఉన్నట్టు వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్‌ను బట్టి చూస్తే అర్థం అవుతుంది.
నిజానికి.. మొబైల్ వర్షన్ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ కోసం నెలకు రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరానికి అయితే రూ.499 అవుతుంది. ఈ ప్లాన్‌లో యాడ్స్ లేకుండా ఉచితంగా సినిమాలు, షోలను వీక్షించవచ్చు. హెచ్డీ స్ట్రీమింగ్, స్టీరియో ఆడియో క్వాలిటీ ఉంటుంది.
ఆ ప్లాన్‌ను కేవలం మొబైల్ యూజర్ల కోసం రూ.49కే కొందరు యూజర్లకు హాట్‌స్టార్ అందిస్తోందని ఓ యూజర్.. స్క్రీన్‌షాట్‌తో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చాలామంది యూజర్లు ఆ ఆఫర్‌ను చూసి చెక్ చేసుకుంటే.. వాళ్లకు ఆ ఆఫర్ కనిపించడం లేదు.
నిజానికి.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు కోట్లలో యూజర్ బేస్ ఉంది. తెలుగు సీరియల్స్, తెలుగు షోలు ఎక్కువగా ఇందులోనే అప్లోడ్ అవుతుంటాయి. అయినప్పటికీ.. ఇండియాలో నిలదొక్కుకోవడం కోసం ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ప్లాన్స్ ధరలను తగ్గించడంతో.. హాట్‌స్టార్ కూడా అప్రమత్తమయింది. యూజర్ల కోసం స్పెషల్ షోలు, సినిమాలను రోజు రోజు అప్లోడ్ చేస్తోంది.
ఇక.. నెట్‌ఫ్లిక్స్ నెల వారి సబ్స్క్రిప్షన్ ధర రూ.199 ని రూ.149 చేసింది. ఇది మొబైల్ వ్యూ కోసం మాత్రమే.
రూ.499 ప్లాన్ రూ.199కి, రూ.649 ప్లాన్ రూ.499కి, రూ.799 ప్లాన్ రూ.649కే నెట్‌ఫ్లిక్స్ అందిస్తోంది. మరోవైపు అమెజాన్ ప్రైమ్ మాత్రం తన మెంబర్షిప్ ధరలను పెంచింది. రూ.999 ఉన్న ఏడాది మెంబర్‌షిప్‌ను రూ.1499కి పెంచింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Worst Company of 2021 | 2021లో అత్యంత చెత్త కంపెనీ ఏదో తెలుసా? ప్రపంచంలోనే టాప్ సంస్థ అది
Safe Online Transactions | ఈ టిప్స్ పాటిస్తే మీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ సేఫ్.. లేదంటే గోవిందా..?
Shining Mask: కొవిడ్ వైరస్ చేరిందో.. ఈ మాస్క్ మెరుస్తుంది! కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు
Signal | వాట్సప్‌కు దీటుగా దూసుకెళ్తున్న సిగ్నల్.. మరో అద్భుతమైన ఫీచర్