Dangerous Android Apps | ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు జాగ్రత్త.. వెంటనే ఈ యాప్స్‌ను డిలీట్ చేయండి
Dangerous Android Apps | గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న అఫిషియల్ యాప్స్‌ను అటాక్ చేసి జోకర్ మాల్వేర్ స్మార్ట్ఫోన్లలోకి ప్రవేశించి.. యూజర్ల డేటాను తస్కరిస్తోందని టెక్ నిపుణులు గుర్తించారు. ఈ మాల్వేర్ ఇప్పటికే 15 పాపులర్ యాప్స్‌పై అటాక్ చేసిందట.
Dangerous Android Apps | టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ.. సైబర్ క్రైమ్స్ కూడా ఎక్కువవుతున్నాయి. హ్యాకర్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. యాప్స్‌తో పలు డేంజరస్ మాల్వేర్స్ను ఫోన్లలో ఇన్స్టాల్ అయ్యేలా చేసి అకౌంట్లలో డబ్బులు ఖాళీ చేస్తున్నారు. అందుకే.. టెక్ నిపుణులు ఏ యాప్ పడితే ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు.. ఈ హ్యాకర్ల టార్గెట్ అవుతున్నారు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న అన్ని యాప్స్‌ను గుడ్డిగా నమ్మకూడదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో రకాల మాల్వేర్స్ మనల్ని అటాక్ చేశాయి. తాజాగా మరో మాల్వేర్ కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా స్మార్ట్ఫోన్లలో చొచ్చుకువస్తోంది. దాని పేరే జోకర్ మాల్వేర్(Joker malware).
గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న అఫిషియల్ యాప్స్‌ను అటాక్ చేసి జోకర్ మాల్వేర్ స్మార్ట్ఫోన్లలోకి ప్రవేశించి.. యూజర్ల డేటాను తస్కరిస్తోందని టెక్ నిపుణులు గుర్తించారు. ఈ మాల్వేర్ ఇప్పటికే 15 పాపులర్ యాప్స్‌పై అటాక్ చేసిందట.
నిజానికి ఈ మాల్వేర్ గత సంవత్సరమే స్మార్ట్‌ఫోన్ యూజర్లను టెన్షన్ పెట్టింది. పలు యాప్స్‌ల సాయంతో స్మార్ట్ఫోన్లలోకి చేరింది. అయితే.. గూగుల్ ఈ మాల్వేర్ యాప్స్‌లోని ఎంబెడ్ కాకుండా.. ఎర్రర్‌ను ఫిక్స్ చేశారు. అప్పటి నుంచి కొన్నిరోజుల పాటు దీని గోల తప్పింది. కానీ.. ఇప్పుడు మళ్లీ తన రూపాన్ని మార్చుకొని కరోనా కొత్త స్ట్రెయిన్లా స్మార్ట్ఫోన్లపై విరుచుకుపడుతోంది.
Dangerous Android Apps | మీ ఫోన్లో ఉన్న ఈ 7 యాప్స్‌ను వెంటనే అన్ఇన్స్టాల్ చేసుకోండి
యాప్స్ ద్వారా ఫోన్లోకి చొరబడి ఈ యాప్ ఖాతాలోని డబ్బులను మాయం చేస్తుంది. ఫిషింగ్ ఎస్ఎంఎస్లను ఫోన్‌కు పంపి యూజర్‌కు తెలియకుండానే అవసరంలేని ప్రీమియం సర్వీసులకు డబ్బులు చెల్లించేలా చేస్తుంది. ఫోన్‌కు వచ్చే ఓటీపీని కూడా సీక్రెట్‌గా రీడ్ చేస్తుంది. బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసుకునే వరకు కూడా బ్యాంకు ఖాతా ఖాళీ అయిందనే విషయాన్ని యూజర్లు కనిపెట్టలేకుండా.. ఈ మాల్వేర్ అకౌంట్లలోని డబ్బులను దొంగలిస్తుంది.
జోకర్ మాల్వేర్తో ఎఫెక్ట్ అయిన ఈ ఆండ్రాయిడ్ యాప్స్‌ను వెంటనే మీ ఫోన్లో ఉంటే డిలీట్ చేసేయండి. లేదంటే.. ఈ యాప్స్ ద్వారా మీ ఫోన్లోకి ప్రవేశించి మీ అకౌంట్‌ను గుల్ల చేస్తుంది ఈ మాల్వేర్.
- Color Message
- Safety AppLock
- Convenient Scanner 2
- Push Message-Texting&SMS
- Emoji Wallpaper
- Separate Doc Scanner
- Fingertip GameBox
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Safe Online Transactions | ఈ టిప్స్ పాటిస్తే మీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ సేఫ్.. లేదంటే గోవిందా..?
Shining Mask: కొవిడ్ వైరస్ చేరిందో.. ఈ మాస్క్ మెరుస్తుంది! కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు
Signal | వాట్సప్‌కు దీటుగా దూసుకెళ్తున్న సిగ్నల్.. మరో అద్భుతమైన ఫీచర్
Fake PAN Card | నకిలీ పాన్‌కార్డును గుర్తించడం ఎలా? స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఇదిగో స్టెప్స్
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? వెంటనే అప్డేట్ చేసుకోండి.. ఆదేశించిన కేంద్రం
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

