ఒత్తిడి.. శరీరంలో చాలా సమస్యలకు కారణమవుతుంది. ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపడమే కాకుండా దాని ప్రభావం జుట్టు, చర్మంపై కూడా కనిపిస్తుందంట. ఇటీవలి పరిశోధన ప్రకారం, మనం ఒత్తిడిని వదిలించుకుంటే తెల్లటి జుట్టు మళ్లీ నల్లగా మారుతుందంట. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్శిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్ పరిశోధకుల ప్రకారం, ఒత్తిడి కారణంగా మానవుల తలపై వెంట్రుకలు తెల్లగా మారుతాయని తొలిసారి రుజువైంది. జుట్టు రంగు మారాయంటే.. దాదాపు 300 రకాల ప్రోటీన్లు కూడా మారుతాయని పరిశోధకులు సెలవిస్తున్నారు. ఒత్తిడి, ఆందోళనతో ఉన్నవారిలో కార్టిసాల్ అనే హార్మోన్ పెద్ద ఎత్తున విడుదల అవుతుంది. ఇది సాధారణ కణాలను ప్రభావితం చేస్తుంది. ఇవి సాధారణ జుట్టు, శరీర రంగుకు సహాయపడతాయి.
ఒత్తిడి కారణంగా జుట్టు పెరుగుదల అధ్యయనంలో పరిశోధకులు మొదటిసారిగా పరిమాణాత్మక ఆధారాలను సేకరించారు. ఒత్తిడి కోల్పోయిన తర్వాత అధ్యయనంలో పాల్గొన్న వారి జుట్టు తిరిగి నల్లగా మారడం ప్రారంభించిందంట. ఇది చూసి పరిశోధకులే నోరెళ్లబెట్టారంట. వెంట్రుకలు చర్మంలో ఫోలికల్స్ రూపంలో ఉన్నప్పుడు, ఒత్తిడి కారణంగా శరీరంలో వచ్చే మార్పుల వల్ల అవి ప్రభావితమవుతాయని, చర్మం నుంచి బయటకు రావడం కష్టం అవుతుందని వారు గుర్తించారు. ఒత్తిడితో ఉన్నప్పుడు మైటోకాండ్రియా, మానవ కణాల పవర్‌హౌస్‌లు మారుతాయని, దీనివల్ల జుట్టులో కనిపించే చాలా ప్రోటీన్లు మారి నల్ల జుట్టు రంగు తెల్లగా మారుతుందని వారు చెప్తున్నారు.
ఒత్తిడి కారణంగా జుట్టు రంగు మారడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకని ఆరోగ్యకరమైన దినచర్యను ఆచరించండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలను నిత్యం అనుసరించండి. జుట్టు తెల్లబడకుండా ఉండేందుకు నిత్యం తీసుకునే ఆహారంలో కోడిగుడ్డు, చేపలు, మోసంబి, డ్రైఫ్రూట్స్, ఉసిరి, గ్రీన్ టీ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
రోజూ యోగా, వ్యాయామం, ధ్యానం చేయాలి.
3 డీ ప్రింటింగ్‌తో కృత్రిమ చెవులు, ముక్కు సృష్టి
‘నేషన్ ఫస్ట్’ మంత్రంతో ముందుకు : మన్ కీ బాత్‌లో మోదీ
చరిత్రలో ఈరోజు.. 43 ఏండ్ల క్రితం టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టి
శుభవార్త..! తగ్గనున్న ఐదు మెడికల్ డివైజ్‌ల ధరలు
ఒలింపిక్స్‌లో 25 ఏండ్ల తర్వాత ఇండియా సంచలనం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..