Fake Certificates | నకిలీ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు.. 9 మంది విద్యార్థుల అడ్మిషన్లు రద్దు!
Fake Certificates | నీట్ అర్హత కలిగి ఉండి 2026-27 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసానికి రిజిస్టర్ చేసుకున్న విద్యార్థుల్లో 37 మంది నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లు సమర్పించినట్టు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.
Fake Certificates | వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 27: నీట్ అర్హత కలిగి ఉండి 2026-27 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసానికి రిజిస్టర్ చేసుకున్న విద్యార్థుల్లో 37 మంది నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లు సమర్పించినట్టు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. వీరిలో 9 మంది అభ్యర్థులు ఇప్పటికే యూనివర్సిటీ పరిధిలోని మెడికల్ కళాశాలల్లో సీట్టు దక్కించుకున్నట్లు గుర్తించారు. నిబంధనలను అనుసరించి నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన విద్యార్థుల సీట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి ఆయా కళాశాలలకు సమాచారం అందించారు.
నీట్ ర్యాంకు ఆధారంగా రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ అధికారులను కోరిన యూనివర్సిటీకి ఆ శాఖ డైరెక్టర్ ఈ నెల 22న నివేదిక సమర్పించారు. దీని ఆధారంగా ఎస్టీ కోటాలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో 37 మంది అభ్యర్థులు ఉన్నట్టుగా వెలుగు చూడటంతో వారిని అనర్హులుగా ప్రకటించారు. ఇప్పటికే వికారాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బుక్కె విశృత్, సిద్దిపేట ఆర్వీఎం ఇన్స్టిట్యూట్లో ఇరుకుల హేమాద్రి, హైదరాబాద్లోని ఈఎస్ఐసీ మెడికల్ కళాశాలలో నేనావత్ కోవిడ, నోవా ఇన్స్టిట్యూట్లో శంకరపురం రచన,
ఉస్మానియా మెడికల్ కళాశాలలో మాలె సాయిహర్షిణి, వడిదె చంద్రహర్షిణి, పటాన్చెరు రాజరాజేశ్వరి మెడికల్ కళాశాలలో కాకి నాగశయన, టీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్లో ఎం గాయత్రీచౌహాన్, కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో దేవరశెట్టి నిహాల్ సిద్ధార్థ్ పొందిన సీట్లు రద్దు చేసినట్టు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఇకపై ఈ 37 మందిని ఎస్టీ క్యాటగిరీలో పరిగణించబోమని, జనరల్ క్యాటగిరీలో మాత్రమే పరిగణిస్తామని యూనివర్సిటీ స్పష్టం చేసింది. రద్దు చేసిన తొమ్మిది సీట్లను ఖాళీ సీట్లుగా ప్రకటించి మలి విడత కౌన్సెలింగ్ ద్వారా అసలైన తెలంగాణ ఎస్టీ విద్యార్థులకు మెరిట్ ప్రకారం సీట్లు కేటాయించనున్నట్టు తెలియజేశారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ మరింత పక్కాగా చేస్తామని అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

