e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home సంగారెడ్డి AndOl‌ | బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌

AndOl‌ | బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌

-విద్యుత్‌ శాఖ అధికారులతో మాట్లాడి రూ.5లక్షల చెక్కు అందజేత

అందోల్‌ : చౌటకూరు మండల పరిధిలోని ఉప్పరిగూడెం గ్రామానికి చెందిన ఉప్పరి అంజయ్య కొన్ని రోజుల కితం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నది. ఈ విషయాన్ని తెలుసుకున్న అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ విద్యుత్‌ శాఖ జోగిపేట డివిజన్‌ సంగారెడ్డి సర్కిల్‌ అధికారులతో మాట్లాడి వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

ఎమ్మెల్యే సూచన మేరకు
విద్యుత్‌ శాఖ మంజూరు చేసిన రూ.5లక్షల చెక్కును శనివారం ఉప్పరి అంజయ్య కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అందోల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో డీఈ శ్రీనివాస్, ఏఈ సురేశ్‌కుమార్‌, రాష్ట్ర మార్క్​‍ ఫెడ్‌ డైరెక్టర్‌ జగన్మోహన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ మల్లికార్జున్‌ గుప్తా, సీనియర్‌ నాయకులు నారాయణ, లింగా గౌడ్‌, సాయికుమార్‌, ఉప్పరిగూడెం సర్పంచ్‌ అల్వాల రేణుకానర్సింలు, పుల్కల్‌ ఉమ్మడి మండల సర్పం‌చ్‌ల ఫోరం అధ్యక్షుడు కిష్టారెడ్డి, ప్రవీణ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement