e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home జిల్లాలు మన భూములకు మరింత పరపతి

మన భూములకు మరింత పరపతి

మన భూములకు మరింత పరపతి

మెదక్‌ జిల్లాలోని అన్ని గ్రామాలు, మండ
పెరిగిన భూముల మార్కెట్‌ విలువ
ఖాళీ స్థలాలు, ప్లాట్ల విలువ పెంపు
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేర్వేరుగా ధరలు
రిజిస్ట్రేషన్‌ చార్జీల సవరణ..7.5 శాతానికి పెంపు
సవరించిన ధరలు నేటి నుంచి అమలులోకి
అన్ని ఏర్పాట్లు చేసిన రిజిస్ట్రేషన్‌ శాఖ

సంగారెడ్డి, జూలై 21(నమస్తే తెలంగాణ)/మెదక్‌/సిద్దిపేట/సిద్దిపేట అర్బన్‌ : సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో భూముల మార్కెట్‌ విలువను ప్రభుత్వం పెంచింది. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్‌ విలువ, రిజిస్ట్రేషన్‌ రుసుములు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. స్టాంపు డ్యూటీని 6శాతం నుంచి 7.5శాతానికి పెంచింది. పెంచిన ధరలు నేటినుంచి అమల్లోకి రానున్నాయి. భూములు, ఆస్తుల విలువ పెంపునకు సంబంధించి సెంట్రల్‌ సర్వర్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇప్పటికే సిద్ధం చేసిన అధికారులు, గురువారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్నా, రిజిస్ట్రేషన్‌కు పెరిగిన ధరలు వర్తిస్తాయి. భూముల మార్కెట్‌ విలువను ఎనిమిదేండ్ల తర్వాత ప్రభుత్వం సవరించింది.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో భూ ముల మార్కెట్‌ విలువను ప్రభు త్వం పెంచింది. సాగు భూములు, ఖాళీ, వ్యవసాయేతర స్థలాల విలువలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. భూముల మార్కెట్‌ విలువతో పాటు రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ చార్జీలు 6 శాతం ఉండగా, తాజాగా స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలు 7.5 శాతానికి పెరిగాయి. పెరిగిన భూముల విలువ, పెరిగిన రిజిస్ట్రేషన్‌ చార్జీలు గురువారం నుంచి అమలులోకి రానున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చే సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాలో వ్యవసాయ భూములు, ప్లాట్ల భూముల గరిష్టంగా 40 నుంచి 50 శాతానికి పెరిగాయి. ప్లాట్ల విలువను ప్రభుత్వం 30 శాతం మేర పెంచింది. మున్సిపాలిటీల్లో భూములు, ప్లాట్ల విలువ గరిష్టంగా 40 శాతం మేర పెరిగాయి. పంచాయతీల్లో వ్యవసాయ భూముల విలువ గరిష్టంగా 30 శాతం పెరిగాయి. భూముల మార్కెట్‌ విలువ ప్రతి రెండేండ్లకు ఒకసారి సవరించాల్సి ఉంది.

- Advertisement -

తెలంగాణలో భూముల మార్కెట్‌ విలువను ఎనిమిదేండ్ల తర్వాత ప్రభుత్వం సవరించింది. భూముల, ప్లాట్ల మార్కెట్‌ విలువను పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్‌ శాఖకు ఆదాయం పెరగనున్నది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 15 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో గతేడాది రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.534.21 కోట్ల ఆదాయం సమకూరింది. జిల్లాలో అత్యధికంగా సంగారెడ్డి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆదాయం సమకూరుతున్నది. ప్రతినెలా సుమా రు రూ.30 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభిస్తున్నది. తాజాగా పెరిగిన ధరలతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనున్నది. వ్యవసాయ భూముల విలువను పెంచడంతో రైతులకు లాభం చేకూరనున్నది. భూముల రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా బ్యాంకులు రైతులకు పంటరుణాలు మం జూరు చేస్తున్నాయి. ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు, ఇతర అవసరాల కోసం భూసేకరణ జరుపుతున్నది. భూముల రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా ప్రభుత్వం పరిహారం చెల్లిస్తున్నది. భూముల రిజిస్ట్రేషన్‌ విలువ పెంచిన నేపథ్యంలో భూసేరణ సమయంలో రైతులకు పెరిగిన భూ ముల విలువ ఆధారంగా పరిహారం చెల్లిస్తారు.

సిద్దిపేట జిల్లాలో…
సిద్దిపేట జిల్లాలో వ్యవసాయ భూములకు కనిష్టంగా ఎకరాకు రూ.75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయేతర భూములకు సంబంధించి చదరపు గజానికి కనీస ధర గతంలో రూ. 100 ఉండేది. ఇప్పుడు దాన్ని కనిష్టంగా రూ. 200కు ప్రభుత్వం పెంచింది. మూడు స్లాబ్‌ల్లో మార్కెట్‌ విలువలను పెంచారు. ప్లాట్లకు సంబంధించి గతంలో రూ.800 ఉండగా, రూ.1000కి పెంచింది. సిద్దిపేట జిల్లాలో రూరల్‌ ప్రాంతాల్లోని మండలాలతో పాటు ‘సుడా’ పరిధిలో కొన్ని మండలాలు, హెచ్‌ఎండీఏ పరిధిలో కొన్ని మండలాలు ఉన్నాయి.ఆయా ప్రాంతాలను బట్టి రేట్లను ప్రభుత్వం పెంచింది.

సంగారెడ్డి జిల్లాలో…
సంగారెడ్డి జిల్లాలోని హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే సం గారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో వ్యవసాయ భూము లు, వ్యవసాయేతర స్థలాల మార్కెట్‌ విలువ 50 శాతానికి పైగా పెరిగాయి. అధికారుల సమాచారం మేరకు హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే సంగారెడ్డి మండలంలోని ఫసల్‌వాదిలో వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువ ఎకరాకు రూ.3లక్షలు ఉండగా, కొత్తగా మార్కెట్‌ విలువ రూ.5 లక్షలు కానున్నది. పటాన్‌చెరు మండలంభానూరులో వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువ ఎకరాకు రూ.6 లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ.9 లక్షలకు పెరిగింది. హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే పటాన్‌చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో మూడు స్లాబ్‌లుగా మార్కెట్‌ విలువలను ప్రభుత్వం పెంచింది. జాతీయ రహదారి పక్కన ఉండే భూముల మార్కెట్‌ విలువ 50శాతం పెరగగా, మండల కేంద్రాల్లో 40శాతం, గ్రామాల్లో 30 శాతం మేర వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. జహీరాబాద్‌, అం దోలు, నారాయణఖేడ్‌ నియోజకవర్గాల్లో గరిష్టంగా 30 నుంచి 40 శాతం మేర మాత్రమే వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువ పెరిగింది. అందోలు మండలం అక్సాన్‌పల్లిలో వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువ ఎకరాకు రూ.1.50 లక్షలు ఉం డగా, సవరించిన విలువ ప్రకారం తాజాగా ఎకరాకు మార్కె ట్‌ విలువ రూ.2.25 లక్షలకు చేరుకుంది.

ఝరాసంగం మండలం అనంతసాగర్‌లో వ్యవసాయభూముల మార్కెట్‌ విలువ ఎకరాకు రూ.60 వేలు ఉండగా, ఇప్పుడు మార్కెట్‌ విలువ రూ.1.50 లక్షలకు పెంచింది. మనూరు మండలం బాదల్‌గావ్‌లో ఎకరా భూమి మార్కెట్‌ విలువ రూ.44వేలు ఉండగా, ప్రస్తుతం రూ.1.25 లక్షలకు పెంచింది. వ్యవసాయేతర స్థలాల మార్కెట్‌ విలువ 30 నుంచి 50 శాతం వరకు పెంచింది. హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే రామచంద్రాపురంలో గరిష్టంగా గజం వ్యవసాయేతర భూమి ధర రూ.20,000 ఉండగా, ప్రస్తుతం 28.000కు పెంచింది. సంగారెడ్డిలో గజం భూమి మార్కెట్‌ విలువ కనిష్టంగా రూ.2500 ఉండగా, ప్రస్తుతం రూ.3500కు పెంచింది. జాతీయ రహదారి పక్కన గజంభూమి ధర గరిష్టంగా రూ.10,000 ఉండగా, ప్రస్తుతం మార్కెట్‌ విలువ రూ.13,000కు పెంచింది. జహీరాబాద్‌ పట్ణణంలో గజం భూమి కనిష్ట మార్కెట్‌ ధర రూ.300 ఉండగా, రూ.500కు ప్రభుత్వం పెంచింది. గరిష్టంగా గజం భూమి ధర రూ.3500 ఉండగా, రూ.5000కు పెంచింది. నారాయణఖేడ్‌లో గజం భూమి ధర కనిష్టంగా రూ.700 ఉండగా, కొత్తగా రూ.1250కి పెంచింది. నారాయణఖేడ్‌ పట్టణంలో గరిష్టంగా గజం భూమి విలువ రూ.2400 ఉండగా, ప్రస్తుతం గజం మార్కెట్‌ విలువ రూ.3500కు పెంచింది. సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లో అపార్ట్‌మెంట్లలో విక్రయించే ప్ల్లాట్ల ధరలను సైతం ప్రభుత్వం పెం చింది. 30 నుంచి 40శాతం వరకు ప్లాట్ల ధరలను పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. పెరిగిన వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూముల ధరలకు అనుగుణంగా గురువారం నుంచి రిజిస్ట్రేషన్లు చేపట్టేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

నేటినుంచి కొత్త చార్జీలు అమలు..
జిల్లాలో పెరిగిన భూముల విలువ, రిజిస్ట్రేషన్ల చార్జీల పెంపు గురువారం నుంచి అమలులోకి రానున్నది. ప్రభు త్వం వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్‌ విలువలను సవరించిన నేపథ్యంలో ఆ మేరకు కొత్త ధరలు, కొత్త రిజిస్ట్రేషన్‌ ధరలను అన్ని రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో ఉన్న కంప్యూటర్లలో సవరించడం పూర్తయ్యింది. రిజిస్ట్రేషన్లు చేసుకునేవారు సవరించిన కొత్త రిజిస్ట్రేషన్‌ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారు సైతం కొత్త ధరల మేరకు రిజిస్ట్రేషన్‌ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

  • రవీందర్‌రావు, ఉమ్మడి మెదక్‌ జిల్లా రిజిస్ట్రార్‌, (సంగారెడ్డి)

ఖాళీ ప్లాట్లకు ఇలా..
ఖాళీ స్థలాల విషయంలో కూడా ప్రభుత్వ నిబంధనలు వర్తించనున్నాయి. మండల కేం ద్రాల స్థాయిలో గతంలో చదరపు గజం రూ. 201-1000గా ఉన్న విలువలు 50 శాతానికి పెంచారు. అంటే రూ.1000 చదరపు గజం విలువ ఇప్పుడు రూ.1500 అవుతుంది. రిజిస్ట్రేషన్‌ ఫీజు 6 నుంచి 7.5 శాతానికి పెరిగింది. కాబట్టి అప్పుడు 100 గజాల ఖాళీ స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు రూ.11,250 చెల్లించాల్సి ఉంటుంది. అదే గతంలో అయితే రూ.6 వేలు కడితే సరిపోయేది.
ప్లాట్లు, అపార్ట్‌మెంట్లకు ఇలా..
లక్ష లోపు జనాభా ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్లాట్లు, అపార్ట్‌మెంట్లకు చదరపు అడుగుకు కనీసం ధర రూ.1000గా నిర్ణయించారు. గతంలో రూ.800 ఉండేది. ఈ ధర ప్రకారం 700 చదరపు అడుగుల ప్లాటు ను రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు 6శాతం ఫీజు చొప్పున రూ.33,600 రిజిస్ట్రేషన్‌ ఫీజు కట్టా ల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు సవరించిన ధరల ప్రకారం చదరపు అడుగుకు రూ.1000 చొప్పున రూ.52,500 (7.5 శాతం) రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్లకు ప్రభుత్వం నిర్దేశించిన విలువల ప్రకారం రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరగనున్నాయి.

పరీక్ష ఏదైనా.. విద్యార్థులదే హవా..
ఇందిరానగర్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. 2020-21 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షలో పాఠశాల నుంచి 13 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. సిద్దిపేట అర్బన్‌ మండలానికి ఆరు ట్రిపుల్‌ ఐటీ సీట్లు రాగా, ఆరు సీట్లు ఇందిరానగర్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే సాధించడం గమనార్హం. కంప్యూటర్‌ పరిజ్ఞానం, సైన్స్‌, రోబోటిక్స్‌, గూగుల్‌ కోడింగ్‌, యోగా తదితర అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ప్రావీ ణ్యం సాధించేలా తీర్చిదిద్దుతున్నారు.

మెదక్‌ జిల్లాలో…
లాలు, పట్టణ ప్రాంతాల్లోని భూముల విలువల్లో మార్పులను ప్రభుత్వం చేసింది. కొత్త ధరలతో గ్రామాల్లోనూ భూముల పరపతి పెరిగింది. ఎకరా వ్యవసాయ భూమి కనీస ధరను ప్రభుత్వం రూ.75 వేలుగా ఖరారు చేసింది. ఖాళీ స్థలాలకు సంబంధించి చదరపు గజం కనీసం రూ.201గా ఖరారు చేసింది. ప్రాంతాన్ని బట్టి విలువ 50, 40, 30 శాతం కేటగిరీలుగా నిర్ణ్ణయించింది. చదరపు అడుగు కనీసం రూ.వెయ్యిగా నిర్ణయించింది. భూ విలువల సవరణతో యజమానులకు ఆ మేరకు అదనంగా రుణాలు అందనున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి అదనపు పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. అధికారికంగా భూముల విలువ పెరగడంతో బ్యాంకు లోన్లు, ఇతర వినియోగాల పరంగా భూయజమానులకు మేలు జరుగనున్నది. ఇప్పటి వరకు ఎకరం భూమి ప్రభుత్వ విలువ రూ.30 వేలు ఉంటే, తాజాగా ప్రాంతాలను బట్టి పెరిగింది. ఇక నుంచి వ్యవసాయ భూమి ఎకరానికి కనీస విలువ రూ.75వేలు ఉండనున్నది. ఖాళీ స్థలాలకు సంబంధించి మండల కేంద్రాల్లో చదరపు గజం రూ.201 నుంచి వెయ్యి వరకు ఉన్న విలువను 50 శాతం పెంచింది. ప్రస్తుతం చదరపు గజం రూ.వెయ్యి నుంచి రూ.1500 అయ్యింది. లక్షలోపు జనాభా ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లో, అపార్ట్‌మెంట్లకు చదరపు అడుగుకు కనీస ధర ఇప్పుడు రూ.800 ఉండగా, ప్రభుత్వం దీన్ని రూ.వెయ్యిగా నిర్ణయించింది.

అవార్డులకు నెలవు ఇందిరానగర్‌ బడి..
జాతీయ స్థాయిలో ఏటా నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ ట్రైనింగ్‌ ఆధ్వర్యంలో జరిగే సెమినార్‌లకు ఈ పాఠశాలకు ఆహ్వానం అందుతున్నది. 2017 నుంచి ఏటా జాతీయ స్థాయిలో విద్యారంగంపై జరిగిన సెమినార్‌ల్లో ప్రధానోపాధ్యాయుడు రామస్వామి పాల్గొని పాఠశాల అభివృద్ధ్ది, ఇన్నోవేటివ్‌, లీడర్‌షిప్‌ తదితర అంశాలపై వివరించారు. హెచ్‌ఎం రామస్వామికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది. రాష్ట్ర స్థాయిలో ఇందిరానగర్‌ పాఠశాలకు 5 అవార్డులు వరించాయి. జిల్లాస్థాయిలో చాలా అవార్డులు లభించాయి.

పది రోజుల నుంచి తిరుగుతున్నా..
మా కూతురిని 8వ తరగతిలో చేర్పిద్దామని పది రోజు ల నుంచి తిరుగుతున్నా. అ డ్మిషన్లు ఫుల్‌ అయినాయని చెబుతున్నారు. ఈ పాఠశాలలో మంచిగా చెబుతున్నారని ఇక్కడి వచ్చిన. మాకు తెలిసిన సార్‌తో రికమెండ్‌ చేపిచ్చినా సీటు దొరకడం లేదు. ఇక్కడ నా కూతురికి సీటు దొరకితే చాలా సంతోషపడతాను.
-గూడ రజిత, పేరెంట్‌, సిద్దిపేట

ప్రైవేట్‌ స్కూల్‌ నుంచి తీసుకొచ్చిన..
నేను ఆటో డ్రైవర్‌ను. మా కొడుకు ఇన్ని రోజులు ప్రైవేట్‌ పాఠశాలలో సదివి చ్చినం. కానీ, ఇక్కడ మం చిగ సదువు చెబుతారని తెలిసి జాయిన్‌ చేద్దామని వచ్చిన. 15 రోజుల నుంచి రోజూ వస్తున్నా. కానీ, సీట్లు లేవు అంటున్నారు. ఎలాగైనా జాయిన్‌ చేయించాలని రోజు వస్తున్న.

  • కెమ్మసారం శ్రీనివాస్‌, పేరెంట్‌, సిద్దిపేట

నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం..
గతంలో 300 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. కానీ, ప్రతి సంవత్సరం 200 సీట్లు పెంచుకుంటూ వస్తున్నం. మంత్రి హరీశ్‌రావు, అధికారుల కృషితో అన్ని రకాలుగా పాఠశాలను అభివృద్ధి చేసుకున్నాం. ఉపాధ్యాయులు, తరగతి గదుల కొరతతో దరఖాస్తు చేసుకున్న వారందరికీ సీటు ఇవ్వలేకపోతున్నాం. పాఠశాలలో ఉపాధ్యాయుల సమష్టి కృషితో నాణ్యమైన విద్య, విలువలు నేర్పిస్తున్నాం. పాఠశాలలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. కరోనా సమయంలో ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ఆన్‌లైన్‌లో బోధన చేశాం.

  • రామస్వామి, హెచ్‌ఎం, ఇందిరానగర్‌ ప్రభుత్వ పాఠశాల, సిద్దిపేట
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మన భూములకు మరింత పరపతి
మన భూములకు మరింత పరపతి
మన భూములకు మరింత పరపతి

ట్రెండింగ్‌

Advertisement