శుక్రవారం 05 మార్చి 2021
Sangareddy - Jan 28, 2021 , 00:28:07

హరిదాస్‌పూర్‌ను అభివృద్ధి చేస్తాం

హరిదాస్‌పూర్‌ను అభివృద్ధి చేస్తాం

  • సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు

సంగారెడ్డి చౌరస్తా, జనవరి 27: ఆడ పిల్లలు పుడితే పండుగ చేయడం గొప్ప విషయమని కలెక్టర్‌ హనుమంతరావు హరిదాస్‌పూర్‌ గ్రామస్తులను అభినందించారు. బుధవారం కొండాపూర్‌ మండలంలోని హరిదాస్‌పూర్‌ గ్రామాన్ని కలెక్టర్‌ సందర్శించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి పారిశుధ్య పనులను పరిశీలించారు. పాఠశాలల పున: ప్రారంభం నేపథ్యంలో తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు. గ్రామంలో ఆడపిల్లలకు ఇస్తున్న గౌరవాన్ని కొనియాడారు. త్వరలోనే మంత్రి హరీశ్‌రావు సందర్శిస్తారని వెల్లడించారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు దాతలు ఆడపిల్లల సంక్షేమం కోసం రూ.50 వేలు అందించారు. పాఠశాలకు రంగులు వేయించారు. ప్రముఖ వైద్యుడు చక్రపాణి మాట్లాడుతూ 12 ఏండ్ల లోపు అమ్మాయిలందరికీ ఉచితంగా తన దవాఖానలో చికిత్స అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్‌రావు, ఎంపీడీవో విజయలక్ష్మి, దాతలు కృష్ణకుమార్‌, జిల్లా జైలు సూపరింటెండెంట్‌ శివకుమార్‌గౌడ్‌, ఉదయ్‌కుమార్‌, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

గోపులారం కల్లాలను పరిశీలన

కొండాపూర్‌ మండలంలోని గోపులారం గ్రామంలోని కల్లాలను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామంలో హరితహారం కార్యక్రమం బాగున్నదని, కల్లాల పనులు పూర్తయినందుకు గ్రామ సర్పంచ్‌ ప్యాట ప్రకాశ్‌, పంచాయతీ కార్యదర్శి నవీన్‌కుమార్‌లను అభినందించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌, ఎంపీడీవో,  సర్పంచ్‌ పాల్గొన్నారు.

రైతులకు అందుబాటులో ఉండాలి

సంగారెడ్డి చౌరస్తా, జనవరి 27:వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలని జిల్లా కలెక్టర్‌ ఎం హనుమంతరావు పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో యాసంగి 2021 పంట సాగుపై కలెక్టర్‌ వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యాసంగి పంటలో రైతులు పాటించాల్సిన మెళకువలను రైతులకు వివరించాలని సూచించారు. రైతుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలన్నారు. అనంతరం తెలంగాణ అగ్రీ డాక్టర్స్‌ అసోసియేషన్‌ 2021 డైరీ, క్యాలెండర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి నర్సింహారావు, టాడా జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌ రాహుల్‌, చైర్మన్‌ భిక్షపతి, ప్రధాన కార్యదర్శి అభినాష్‌వర్మ, కోశాధికారి వెంకటేశం, అసోసియేట్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ ప్రసాద్‌, ఏడీఏలు కరుణాకర్‌రెడ్డి, హరిత, సభ్యులు విజయరత్న, అరుణ, రమ్య, నవీన్‌, రమేశ్‌, స్వప్న, మీనా తదితరులు పాల్గొన్నారు.

ఎద్దుమైలారం సర్పంచ్‌కు కలెక్టర్‌ అభినందన

కంది : మండలంలోని ఎద్దుమైలారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ  కలెక్టర్‌ హనుమంతరావు  గ్రామ సర్పంచ్‌ను అభినందించారు.  కొండాపూర్‌ మండలంలోని హరిదాస్‌పూర్‌ గ్రామంలో బుధవారం సన్మానించారు. ఎద్దుమైలారం గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిద్దుతున్నాడని ఆ గ్రామ సర్పంచ్‌ కాసాల మల్లారెడ్డిని ప్రశంసించారు. 

VIDEOS

logo