సత్ఫలితాలు ఇచ్చిన మిషన్ కాకతీయ

భారీ వర్షాలకు పెరిగిన భూగర్భ జలాలు
ప్రజలకు తీరిన తాగు, సాగు నీటి కష్టాలు
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
ఝరాసంగం : తెలంగాణ సర్కారు అమలు చేసిన మిషన్ కాకతీయ పథకం సత్ఫలితాలను ఇస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులతో చెరువులు, కుంటలను పునరుద్ధరించడంతో భారీ వర్షాలకు ఈ ఏడాది భూగర్భ జలాల నీటిమట్టం పెరిగింది. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండలా మరాయి. దీంతో యాసంగి పంట సాగుకు, ప్రజలకు తాగు నీటి కొరత తీరింది. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన మిషన్ కాకతీయ పథకంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు నాలుగేండ్ల తర్వాత చెరువులు, కుంటల్లో జలకళ సంతరించుకుంది. ఆయకట్టు రైతులు వేసవిలో పలు రకాల అంతర్ పంటలు సాగు చేస్తున్నారు. శనగ, జొన్న, మక్క జొన్న, గోధుమ పంటలను రైతులు సాగు చేసి దిగుబడులు సాధిస్తున్నారు. మండలంలోని ఏడాకులపల్లి, మేదపల్లి, గంగాపూర్, జీర్లపల్లి చెరువుల కింద ఆయకట్టు 1625 ఎకరాలు ఉండగా, ఆయా చెరువుల కింద దాదాపు 500 ఎకరాల వరకు పంట సాగు చేశారు. విద్యుత్ మోటర్లు లేకుండానే నేరుగా చెరువు నీటితో పంటలు సాగు చేస్తున్నారు.
జలకళతో చెరువులు...
మండలంలో ఏడాకులపల్లి శివారులో ఉన్న చెరువు పెద్దది. దీన్ని నిర్మాణం చేపట్టి దాదాపుగా 49 ఏండ్లు పూర్తయింది. నిర్మాణం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నడూ ఎండిపోలేదు. ఈ చెరువు కింద ఏడాకులపల్లి, జునేగావ్, ఇస్లాంపూర్ గ్రామాల ఆయకట్టు రైతులు ఉన్నారు. అదే విధంగా మేదపల్లి, గంగాపూర్ శివారులో ఉన్న చెరువుల్లో నీరు పుష్కలంగా ఉంది. ఆయా చెరువుల కింద శనగ, జొన్న, మక్కజొన్న, గోధుమ, చెరుకు, వరి పంటలు సాగు చేస్తున్నారు. నీటి నిల్వను ఆయకట్టు రైతులు కాపాడుతూ ఏడాదికి మూడు పంటలు సాగు చే సుకుంటున్నారు. దీంతో పశువులకు పచ్చిగడ్డి, పంటలకు నీరు అందడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామానికి చెరువు కన్నతల్లి లాంటిది..
మా ఊరి చెరువుతో ఆయకట్టు కింద ఉన్న గ్రామా లు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. గ్రామంలోని రైతులంతా ఏడాదికి మూడు పంటలు పండిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు తేడాలేకుండా పంటల సాగుకు నీరు అందిస్తున్నాం. మా ఊర్లో చెరువు కన్నతల్లిలా గ్రామస్తులను ఆదుకుంటుంది. ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మతులకు ప్రత్యేకంగా చొరవ చూపడంతో రైతులకు ఎంతో మేలు జరిగింది.
- రవికుమార్, రైతు, ఏడాకులపల్లి
తాజావార్తలు
- వన్‌ప్లస్ 9 సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్
- వీడియో : కబడ్డీ ఆడిన నగరి ఎమ్మెల్యే రోజా
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
- గుర్రంపై అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మెల్యే
- మేఘన్‌కు సెరెనా విలియమ్స్ మద్దతు
- కోటాపై 50 శాతం పరిమితి : పున:సమీక్షించాలన్న సుప్రీంకోర్టు!
- నేనలా అనలేదు.. మీడియాలో తప్పుగా వచ్చింది: సీజే బొబ్డే
- హిందుస్థాన్ పెట్రోలియంలో ఇంజినీర్ పోస్టులు
- మహిళా దినోత్సవం : మగువలకు టెక్ దిగ్గజం బాసట!
- ఆరోగ్య కారణాలంటూ అభ్యర్థినిని తప్పించిన టీఎంసీ