సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sangareddy - Aug 05, 2020 , 00:20:52

రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

  •  l ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
  • l నిజాంపేటలో100 శాతం డంపింగ్‌ యార్డు  నిర్మాణాలు పూర్తి
  •  l కాళేశ్వరం  ప్రాజెక్ట్‌తో 19 వేల ఎకరాలకు సాగునీరు
  •  l ఇంటింటికీ భగీరథ నీళ్లు 

 నిజాంపేట /చేగుంట :   రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆమె నిజాంపేటతో పాటు నందిగామ,చల్మెడ, బచ్చురాజ్‌పల్లి, తిప్పనగుల్ల, వెంకటాపూర్‌(కె), నార్లపూర్‌ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, భూమిపూజ చేసి మాట్లాడారు. ప్రతి పల్లెకు రోడ్డు మార్గం, వసతి ఉండాలనే లక్ష్యంతో చల్మెడ గ్రామంలో 3.42 కోట్లతో అంతర్గత జిల్లా బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశామన్నారు.  పల్లెప్రగతి పనుల్లో భాగంగా నిజాంపేట మండలంలో 100 శాతం డంపింగ్‌యార్డు నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు.    రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా నిజాంపేట మండలానికి 19 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తామని తెలిపారు.

పంచాయతీ ట్రాక్టర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

నందిగామలో గ్రామ అవసరాలకు కొనుగోలు చేసిన పంచాయతీ ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. 

పంచాయతీ సెక్రటరీపై ఆగ్రహం

వెంకటాపూర్‌(కె)లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి గ్రామ పాఠశాల ప్రధానమార్గంలో నీటి నిల్వను చూసి పంచాయతీ సెక్రటరీ నాగలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిల్వ నీటితో వ్యాధులు ప్రబలుతాయని, నీటి నిల్వను తొలిగించాలని  ఆదేశించారు.  కార్యక్రమంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు,జడ్పీటీసీ పంజా విజయకుమార్‌, కల్వకుంట పీఏసీఎస్‌ చైర్మన్‌ అందె కొండల్‌రెడ్డి,  రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్‌ సంపత్‌, రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌,తహసీల్దార్‌ జైరాములు, ఎంపీడీవో వెంకటలక్ష్మి, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు మహమ్మద్‌ గౌస్‌, నిజాంపేట పీఏసీఎస్‌ డైరెక్టర్లు స్వామిగౌడ్‌, అబ్దుల్‌అజీజ్‌, కిష్టారెడ్డి,  సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, కార్యదర్శులు ఉన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం

 చేగుంట:  నార్సింగి మండల పరిధిలోని జెప్తిశివునూర్‌ గ్రామంలో  సీసీ రోడ్లు, మురికి కాలువలు, సెగ్రిగేషన్‌ షెడ్లను సర్పంచ్‌ షరీఫ్‌, నాయకులతో కలిసి ఎమ్మెల్యే    పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా  కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు.  కార్యక్రమంలో ఎంపీపీ  సబిత, జడ్పీటీసీ బాణపుర కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌  మండలాధ్యక్షుడు తౌర్యనాయక్‌, పట్లోరి రాజు, వైస్‌చైర్మన్‌ దొబ్బల సుజాత, సత్యనారాయణ, చెప్యాల మల్లేశం, రుక్మొద్దీన్‌,  ఎంపీడీవో అనంద్‌మేరితో పాటు వార్డు సభ్యులు పాల్గొన్నారు. 


logo