గురువారం 13 ఆగస్టు 2020
Sangareddy - May 19, 2020 , 00:16:48

కరోనా సమయంలో రైతులకు గిట్టుబాటు ధర

  కరోనా సమయంలో రైతులకు గిట్టుబాటు ధర

 రైతుల ముంగిట కొనుగోలు కేంద్రాలు      

10 గ్రామాల్లో  సుమారు 11 వేల క్వింటాళ్ల తూకం 

 త్వరలో రైతుల ఖాతాల్లోకి రూ.5.35 కోట్లు       

హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు

రాయికోడ్‌ : కరోనా సమయంలో పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో వరం ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో శనగలు కొనుగోలు చేసినందుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాయికోడ్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో శనగలు అధికంగా రైతులు పండించారని సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

రైతుల ముంగిట శనగల కొనుగోలు కేంద్రాలు..

మండల పరిధిలోని సింగితం, సంగాపూర్‌ గ్రామాల్లో ఏడాకులపల్లి పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్‌ సౌజన్యంతో శనగల కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేశారు. శనగలు తీసుకొచ్చిన రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. వరం ఆధ్వర్యంలో రాయికోడ్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డుతోపాటు పాంపాడు, ఇటికేపల్లి, జంబ్గి(కె), పీపడ్‌పల్లి, ఇందూర్‌ గ్రామాల్లో శనగల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు అవసరమైన గన్నీ బ్యాగులు, క్లీనింగ్‌, తూకం యంత్రాలను అధికారులు అందుబాటులో ఉంచారు. తేమ శాతం వచ్చిన శనగలు వెంటనే కొనుగోలు చేశారు. రైతులకు టోకెన్లు ఇస్తూ క్రమ పద్ధతిలో శనగలు కొనుగోలు చేశారు. 

ఎమ్యెల్యే చంటి క్రాంతికిరణ్‌ ప్రత్యేక కృషి..

రాయికోడ్‌, వట్‌పల్లి, మునిపల్లితోపాటు పలు మండలాల్లో శనగలను రైతులు అధికంగా పండిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ రైతులకు ఆర్థికంగా లబ్ధిచేకూరాలనే ఉద్దేశంతో మండలంలో వివిధ గ్రామాల్లో వరం ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అందుకు స్పందించిన జిల్లా అధికారులు వెంటనే గ్రామాల్లో శనగల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో రైతులు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

10 గ్రామాల్లో  సుమారు 11 వేల క్వింటాళ్ల తూకం..  

రైతులు దళారులను నమ్మి మోసపోకుండా శనగలకు మద్దతు ధర కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం రాయికోడ్‌ మార్కెట్‌ యార్డుతోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో శనగల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలను ఏప్రిల్‌ 2న ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ ప్రారంభించారు. 

ప్రతి గింజను కొంటాం 

రాయికోడ్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డుతోపాటు వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నాం. 16 రోజుల్లో 894 మంది రైతుల నుంచి సుమారు 11 వేల క్వింటాళ్ల శనగలను కొనుగోలు చేశాం. ఆన్‌లైన్‌లో పేరు వచ్చిన రైతులతోపాటు వీఆర్‌వ్వో, ఏఈవో, ఏవో నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకొచ్చిన వారి శనగలు కొనుగోలు చేశాం. 

- వీరారెడ్డి, వరం అధ్యక్షుడు 


logo