మంగళవారం 14 జూలై 2020
Realestate - Jun 27, 2020 , 00:17:04

కమ్మని నిద్రకు కావాలివే..

కమ్మని నిద్రకు కావాలివే..

 • కలతలేని నిద్రకు ఫెంగ్‌షుయ్‌ సూచనలు 

రోజులో ఎక్కువ కాలం మనం గడిపేది పడక గదిలోనే. జీవితంలో మూడో వంతు గడిచేదీ ఇక్కడే. కానీ, శయనాగారానికి ఎంతమంది ప్రాధాన్యమిస్తారు చెప్పండి? ఒక పక్కంతా ఆక్రమించే వార్డురోబు, బీరువా, విడిచిన బట్టలు, పక్క గుడ్డలు, పుస్తకాలు.. ఇవన్నీ ప్రతికూల శక్తిని ప్రేరేపిస్తాయి. నిద్రనూ, ఆరోగ్యాన్నీ దూరం చేస్తాయి. పడక గదిని కలల మందిరంగా రూపొందించేందుకు ఫెంగ్‌షుయ్‌ కొన్ని చిట్కాల్ని చెబుతున్నది.

 • పడక గది తలుపులు పూర్తిగా తెరుచుకోవాలి. కిటికీ పక్కనే తలపెట్టుకుని పడుకోవద్దు. తప్పనిసరి అయితే కాంతి ప్రసరించని విధంగా కర్టెన్‌ వేసుకోవాలి.
 • అటాచ్డ్‌ బాత్‌రూము తప్పనిసరి అయిపోయింది కాబట్టి, లావెటరీ సీటును మూసి ఉంచండి. నల్లా, షవర్‌లలో నీళ్లు వృథాకాకుండా జాగ్రత్తపడండి. ఎప్పుడూ బాత్‌రూమ్‌ తలుపు మూసే ఉంచాలి.
 • బెడ్‌షీట్‌లు, పిల్లో కవర్లు, కర్టెన్లు.. లేత, ఆహ్లాదకరమైన రంగుల్లో ఉంటే మంచిది. లేత నిమ్మపండు రంగు అయితే ఉత్తమం.
 • ఫ్యాన్‌, బెడ్‌ ల్యాంప్‌ సరిగ్గా నడినెత్తిన ఉండేలా మంచాన్ని
 •  అమర్చుకోకండి.
 • తలుపు ఉండే వైపు కాళ్లు పెట్టి పడుకోవద్దు. మంచం మీద నుంచి చూస్తే తలుపు కనబడుతూ ఉండాలి.
 • బీమ్‌ కింద, లోరూఫ్‌ కింద పడుకోవద్దు. పడక గదిలో శ్లాబు వాలుగా ఉండకూడదు. బరువైన వస్తువులపై గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఎక్కువ ఉంటుంది.
 • చెక్క మంచాలు ఉత్తమోత్తమం. ఇనుప మంచాలు విద్యుదయస్కాంత తరంగాల్ని ఆకర్షిస్తాయి. మనసులో కల్లోలం రేపుతాయి.
 • మంచానికి హెడ్‌ బోర్డు ఉంటే మనసుకు దన్ను ఉన్న భావన కలుగుతుంది.
 • తలపెట్టుకునే వైపు (హెడ్‌ బోర్డు) గోడకు ఆనుకునేలా చూసుకోవాలి. అలాగని మంచాన్ని గదిలో ఓ మూలకు నెట్టేయకండి.
 • ఫెంగ్‌షుయ్‌ ప్రకారం కాళ్ల వైపు అద్దం పెట్టుకోవడం పెద్ద దోషం. అద్దంలో మంచం కనిపిస్తూ ఉంటే మంచిది కాదు.
 • సామాన్లు, ఫర్నీచరు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇరుకు గదుల్లో ప్రతికూల శక్తి చేరి మానసిక అలజడిని సృష్టిస్తుంది. మన ఇంట్లో మన చుట్టూ ఉండే సానుకూల శక్తి (ఎనర్జీ)ని పెంపొందించి ఆశించిన ఫలితాల్ని సాధించే మార్గాన్ని సుగమం చేస్తుంది. 


తాజావార్తలు


logo