రామగిరి, మే 3: వైద్య విద్య (ఎంబీబీఎస్, డెంటల్) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్-2024 ప్రవేశ పరీక్ష ఆదివారం జరుగనున్నది. ఇందుకోసం నల్లగొండ జిల్లా కేంద్రంలో 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు నల్లగొండ సిటీ కో ఆర్డినేటర్, నల్లగొండ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ జి.పార్థసారధి శుక్రవారం వెల్లడించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:30వరకు జరిగే పరీక్షలకు 2,316 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.