పెంచికల్పేట్, మే 3 : మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో ఈ నెల 5న నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సభా స్థలాన్ని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సర్కారు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సకును గెలిపిస్తాయన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జన సమీకరణపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామగోని శంకర్ గౌడ్, బిట్టు శ్రీనివాస్, రాచకొండ కృష్ణ, నౌనురి శ్రీనివాస్, కొల్లిపాక శ్రీనివాస్ పాల్గొన్నారు.