శంషాబాద్ రూరల్, ఆగస్టు 15 : ఫాంహౌజ్లో హుక్కా తాగుతూ 7 మంది యువకులు పట్టుబడిన సంఘటన శుక్రవారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గండిగూడ గ్రామ పరిధిలోని ఎంఆర్జీ ఫాం హౌజ్లో కొంతమంది హుక్కా తాగుతూ పార్టీ చేసుకుంటున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా హుక్కా తాగుతూ పట్టుబడ్డారు. అక్కడ పార్టీ చేసుకోవడానికి ఎలాంటి అనుమతిలేకపోయిన సదరు వ్యక్తులు వారికి నచ్చిన విధంగా హుక్కా తాగుతూ పార్టీలో ఎంజాయ్ చేస్తున్నారు.
వారిని ఆదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న హుక్కా తాగడానికి ఉపయోగించిన పరికరాలు, ద్విచక్ర వాహనం(స్కూటి), 5 సెల్ఫోన్లులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో హైదరాబాద్ నగరానికి చెందిన ఎండీ దస్తగిరి,ఏస్కే అసద్,అర్బజ్ షరీఫ్, సైయ్యద్అర్బజ్, ఎండీ అమీర్, ఎండీ రెహన్, ఎండీ ఫరాజ్లను ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించిన్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.