Ganja | రంగారెడ్డి జిల్లా : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి కిస్మత్పూర్లో గంజాయి మొక్కలు కలకలం సృష్టించాయి. ఓ యువకుడు కిస్మత్‌పూర్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. సదరు యువకుడు గంజాయి మొక్కలు పెంచుతున్నాడన్న పక్కాసమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు దాడులు చేపట్టారు.
అక్రమంగా గంజాయిని సాగు చేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యూపీకి చెందిన రాజేందర్ గత నాలుగైదు నెలలుగా గంజాయి సాగు చేస్తూ చుట్టుపక్కల ఉండే యువకులకు గంజాయి సప్లై చేస్తున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. యువకుడిపై కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Air India | విమానం టేకాఫ్‌కు ముందు పైలట్ వద్ద మద్యం వాసన.. అరెస్ట్