షాద్నగర్: రంగారెడ్డి జిల్లా కొత్తూరు (kothur) మండలం విషాదం చోటుచేసుకున్నది. చేపలు పట్టడానికి వెళ్లిన యువకుడు చెరువులో గల్లంతయ్యాడు. మెల్లగూడ గ్రామపంచాయతీ పరిధిలోని కాలనీ తాండాకు చెందిన రాజు భోగ్య.. కొత్తూరు సమీపంలోని జేపీ దర్గా వద్దనున్న చెరువులో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో అందులో మునిగిపోయారు.
గ్రామస్తులు అతడిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆచూకీ లభించడం లేదన్నారు. అధికారులకు సమాచారం అందించినప్పటికీ ఎవరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజు కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.