యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంలాంటిదని జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ అన్నారు. మండలంలోని మాల్ గ్రామానికి చెందిన పెంటయ్య అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఆర్థిక ఇబ్బందులతో దవాఖాన బిల్లులు చెల్లించలేక అవస్తలు పడుతున్న ఆయనకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సహకారంతో రూ. 29,000ల చెక్కును గురువారం ఆమె బాధితునికి అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ఎంతోమంది పేదలకు అండగా నిలుస్తుందన్నారు. ఇప్పటికే మండలంలోని ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుందన్నారు.
పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు చిన్నోళ్ల యాదయ్య, జంగయ్య, మహేశ్, శ్రీను, రమేశ్ పాల్గొన్నారు.