Woman Missing | షాబాద్, జూన్ 26 : ఇంట్లో నుండి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన షాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. షాబాద్ సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ గ్రామానికి చెందిన సోన్నాయిల స్వాతి అనే మహిళ ఈ నెల 22వ తేదీన ఇంటి నుండి వెళ్లిపోయింది. అప్పటి నుండి కుటుంబసభ్యులు ఆమె కోసం బంధువుల వద్ద, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం ఆమె భర్త నరేందర్ షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే వెంటనే 9989792750, పోలీస్ నెంబర్100కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.