పల్లెకు ప్రగతి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రా మాల రూపురేఖలు మారిపోతున్నాయి. గత ప్రభుత్వాలు గ్రామాలను పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తర్వా త ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
- పల్లె ప్రగతి కార్యక్రమంతో మారిన లక్ష్మీపల్లి
- ప్రారంభానికి సిద్ధంగా వైకుంఠధామం
- డంపింగ్ యార్డులో వర్మీ కంపోస్టు ఎరువు తయారీ
- ప్రత్యేక నిధులతో పారిశుధ్య పనులు
- ఎన్ఆర్ఈజీఎస్తో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం
కొడంగల్, ఫిబ్రవరి 9 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రా మాల రూపురేఖలు మారిపోతున్నాయి. గత ప్రభుత్వాలు గ్రామాలను పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తర్వా త ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పె ట్టింది. పల్లె ప్రగతి ప్రారంభంతో గ్రామాల రూపురేఖ లు మారిపోయి నేడు ఏ పల్లెను సందర్శించిన అభివృద్ధితో పాటు స్వచ్ఛతకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. గ తంలో మురుగు కంపు, చెత్తా చెదారంతో పాటు రోడ్లు అధ్వానంగా ఉండేవి. ప్రస్తుతం సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణంతో స్వచ్ఛత మధ్య పల్లె ప్రజల జీవనం ఆనందంగా కొనసాగుతున్నది. కొడంగల్ మండలంలోని 26 పంచాయతీల్లో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రతి పంచాయతీకీ వైకుంఠధామం, కంపోస్టు షెడ్, డంపింగ్యార్డ్, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, సీసీ రోడ్లు, మురుగు కాల్వలు తదితర వాటి ఏర్పాటుతో గ్రామాల్లో అభివృద్ధి కనిపిస్తున్నది. మిషన్ భగీరథతో తాగునీటి సమస్యను అధిగమించారు.
మారిన గ్రామ రూపురేఖలు
మండలంలోని లక్ష్మీపల్లి గ్రామం నేడు స్వచ్ఛతతో విరాజిల్లుతున్నది. గతంలో లక్ష్మీపల్లి, సంగాయిపల్లి రెండు గ్రామాలు కలిసి లక్ష్మీపల్లి పంచాయతీ పరిధిలో ఉండే వి. ప్రభుత్వం ప్రతి 500 జనాభాకు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడంతో లక్ష్మీపల్లి, సంగాయిపల్లిని రెండు వేర్వేరు పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. గతంలో లక్ష్మీపల్లి గ్రామం పేరుకే పంచాయతీగా ఉండేది. కానీ నిధులు అందుబాటులో లేక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. తెలంగాణ ప్రభు త్వం ఏర్పాటు తర్వాత లక్ష్మీపల్లి గ్రామ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గ్రామంలో స్థలం అందుబాటులో లేకపోవడంతో సంగాయిపల్లి శివారులో వైకుంఠధామం, కంపోస్టు షెడ్ల నిర్మాణం చేపట్టారు. కంపోస్ట్టు షెడ్లో తడి, పొడి చెత్తను వేరు చేసి వర్మీ కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు. వీటితో పంచాయతీకి అదనపు ఆదాయం సమకూరుతున్నది. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు, మురుగు కాల్వలను నిర్మించారు. ప్రతి నెలా పల్లె ప్రగతి పనుల నిర్వహణకు రూ.60వేలు మంజూరు చేస్తున్నారు. ఈ నిధులను పారిశుధ్య కార్మికుల వేతనాలు, విద్యుత్ బిల్లులు, చెత్తను సేకరించే ట్రాక్టర్కు డీజిల్ చెల్లింపులకు వినియోగిస్తున్నారు.
కిలోమీటర్ మేర ఎవెన్యూ ప్లాంటేషన్
లక్ష్మీపల్లి నుంచి అంగడిరాచూర్ రోడ్డు వరకు కిలో మీటర్ మేర ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా వేయి మొక్కలు నాటారు. వీటిలో ప్రస్తుతం 900 మొక్కల ను సంరక్షించినట్లు సర్పంచ్, కార్యదర్శి పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం పంచాయతీ ట్రాక్టర్ ద్వారా నీటిని అందిస్తున్నారు. హరితహారంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీలో 5వేల వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అత్యవసర సమయంలో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సహకారంతో గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీంతో గ్రామస్తుల ఏళ్లనాటి బీటీ రోడ్డు కల నెరవేరింది.
స్వచ్ఛతకు ప్రాధాన్యం
లక్ష్మీపల్లి గ్రామాన్ని పూర్తి స్వచ్ఛతగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఇప్పటికే గ్రామం లో చాలా వరకు స్వచ్ఛత నెలకొన్నది. గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు ఏర్పాటు చేయించాం. ఇంకా కొన్ని వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ప్రతి రోజూ ట్రాక్టర్ ద్వారా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేయిస్తున్నాం. తడి, పొడి చెత్త వేర్వేరుగా చేసి కంపోస్టు ఎరువు తయారు చేయిస్తున్నాం. వీటితో పంచాయతీకి అదనంగా ఆదాయం వస్తున్నది.
– అంజలి, పంచాయతీ కార్యదర్శి, లక్ష్మీపల్లి, కొడంగల్ మండలం
అభివృద్ధి పథంలో గ్రామం
ప్రభుత్వం నిర్వహించిన పల్లె ప్రగతితో మా గ్రామం అభివృద్ధిని సాధించింది. వైకుంఠధా మం నిర్మాణం పూర్తి చేయించి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాం. గ్రామంలోని కొన్ని వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాం. మిషన్ భగీరథతో తాగునీటి సమస్యను అధిగమించాం. దీంతో గ్రామస్తులకు తాగునీటి కష్టాలు దూరమయ్యాయి. గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– భీమమ్మ, సర్పంచ్, లక్ష్మీపల్లి, కొడంగల్ మండలం
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

